Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మె బాటలో వీఆర్ఏలు అ ఇబ్బందులు పడుతున్న అధికారులు, ప్రజలు అ వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని ప్రజా సంఘాల డిమాండ్
తమ సమస్యలను పరిష్కరించే వరకు విధులకు హాజరయ్యేది లేదని వీఆర్ఏలు తేల్చి చెబుతూ సమ్మెకు సిద్ధమౌతున్నారు. అందులో భాగంగా గురువారం నుంచి వారు విధుల్లో పాల్గొనడం లేదు. తహసీల్దార్ కార్యాల యా ల్లో పని చేసే వారు సైతం రాక పోవడంతో అధికారులు, వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారు. దీంతో వీఆర్ఏల సమస్యలు పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
నవతెలంగాణ- హన్వాడ
తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో గ్రామ కావలికారులు (వీఆర్ఏ)లు గురువారం నుండి గ్రామాల్లో విధులకు హాజరు కావడం లేదు. ఈనెల 20 వరకు గ్రామాల్లో విదు ల్లో పాల్గొనకుండా నిరసన వ్యక్తం చేస్తామని, 21 నుండి 25 వరకు కలెక్టర్ కార్యాలయాల వద్ద దీక్ష చేపట్టి 25 నుండి పూర్తిస్థాయిలో సమ్మెలోకి వెళ్ళనునట్లు వారు తెలిపారు.
హన్వాడ తహసీల్దార్ కార్యాలయంలో పూర్తిస్థాయి సిబ్బంది లేక పోవడంతో అధికారులు చదువుకున్న 8 మంది వీఆర్ఏలతో పనులు చేయిస్తున్నారు. వారు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడంతో వివిధ ధ్రువ పత్రాల కోసం వచ్చే రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల కోసం జనం వస్తుండగా తహసీల్దార్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. అంతేగాక తెలంగాణ ప్రభు త్వం వీఆర్వోలని తొలగించి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తోంది వారికి పనులు అప్పజెప్పకుండా ప్రతినెల జీతా లు చెల్లిస్తుంది. వారి విధులు కూడా వీఆర్ఏలు నిర్వర్తిం చడంతో పని భారం వీఆర్ఏలపై పడింది. ఇప్పుడు వారు కూడా సమ్మెలకు వెళ్లిపోవడంతో కార్యాలయానికి పనుల కోసం వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇబ్బంది కలుగుతోంది
- తహసీల్దార్ బక్క శ్రీనివాసులు
గ్రామాల్లో ఏ చిన్న సమస్య ఉన్నా వీఆర్ఏలు ఇచ్చిన రిపోర్టు ఆధారంగానేపై విచారణ చేసి సమస్యను పరిష్క రించేందుకు చర్యలు తీసుకుంటాము కానీ వారు సమ్మెలోకి వెళ్లడంతో ఇబ్బందిగా మారింది.