Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు వైద్యాధికారి వెంకటదాసు
నవతెలంగాణ - తిమ్మాజీపేట
గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా , పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ వెంకట దాస్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. సోమవారం మండ ల పరిధిలోని మరికల్ గ్రామ ఉప ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భం గా రికార్డులను తనిఖీ చేసి. ప్రికాషన్ డోస్ వ్యాక్సి నేషన్ పై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనం తరం మాట్లాడుతూ అందరికీ సకాలంలో టీకాలు ఇవ్వాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై గ్రామంలో డెంగ్యూ, టైఫాయిడ్, జ్వరాలు రాకుండా, పరిస రాల పరిశుభ్రతపైన అవగాహన కల్పించాలని ఆదేశించారు.
కష్ట తరమైన కాన్పులను గుర్తించాలి
కందనూలు: కష్ట తరమైన కాన్పులను గుర్తించి భర్త్ ఫ్లాన్ చేెయాలని జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకట్దాస్ వైద్య సిబ్బందికి సూచించారు. సోమవారం జిల్లావైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మాత, శిశు సంరక్షణ సేవలు, గర్భిణుల ప్రసవ సేవలు తదితర అంశా లపై ఆశా, నోడల్ పర్సన్స్, ఆశా ఫెసిలిటెటర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గర్భిణికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి బర్త్ ప్లాన్ చేయాలన్నారు.
ప్రతి కాన్పు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగేలా చూడాలని ఆదేశించారు. గర్భిణుల్లో రక్తహీనత లేకుండా చూడాలన్నారు. గర్భిణులను వెంటనే గుర్తించి 12 వారాల్లో రిజర్వేషన్ చేసి రోజుకు ఒకటి చొప్పున 180 రోజులు ఐరన్ ఫోలిక్ మాత్రలు అందిం చాలన్నారు. రక్తహీనత గల గర్భిణుల లిస్ట్ తయా రు చేయాలని గర్భిణులు టోల్ ఫ్రీ నంబర్ 1800 59912345 ద్వారా గైనకాలజిస్ట్ వైద్యసేవలు పొందాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రో గ్రాం ఆఫీసర్ డాక్టర్ రవినాయక్, నరసింహ. ప్రమిలా నిరంజన్, సాగర్ సూపర్వై జర్స్ సునంద, మల్లమ్మ, అంజనమ్మ, ప్రభావతి, వెంకటమ్మ, ఆశ నోడల్ పర్సన్స్ ఫెసిలిటేటర్స్ తదితరులు పాల్గొన్నారు.