Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ డి.అరవింద్‌చారి
నవతెలంగాణ- కందనూలు
గత కొన్ని రోజులుగా పత్రికా ముఖంగా, సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘా లు నల్లమట్టి అక్రమ రవాణాపై ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిపై చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించి వివరణ ఇవ్వాలని బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి డిమాండ్ చేశారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బీసీ సంఘం నాయ కులు ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ బీసీలు ఇప్పుడిప్పుడే రాజకీయంగా ముందుకు వస్తున్నారని బీజేపీ నుండి టికెట్ పొంది ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన దిలీపాచారి నల్ల మట్టి విషయంలో ప్రశ్నించారని దీనిపై ఆయన ఇల్లు ముట్టడిస్తామని, భౌతిక దాడులు చేస్తామని దళిత సంఘం నాయకులు దిలీపాచారిని బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. టిఆర్ఎస్ పార్టీకి అనుసంధానంగా పనిచేస్తే పార్టీ నుండి విమర్శించాలే తప్పా దళిత సంఘం నాయకులు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి ఒక బీసీ సామా జిక వర్గానికి చెందిన వ్యక్తిని బెదిరించడం సమంజసం కాదన్నా రు. దిలీపాచారికి బీసీ సంఘాలు అండగా ఉంటాయన్నారు. గతంలో ప్రతిపక్ష పార్టీలు అక్ర మ నల్ల మట్టి పైన శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసినా ఎమ్మెల్యే ఇంతవరకు శ్వేత పత్రం విడుదల చేయలేదని గుర్తు చేశారు. నల్లమట్టి రవాణాకు పర్మిషన్లు ఉంటే పత్రికా ముఖంగా బహి ర్గతం చేసి నాగర్‌కర్నూల్ పట్టణంలోని శాంతియుత వాతావరణం నెలకొల్పాలని అన్నారు. లేదంటే ప్రతి పక్షాలు అన్నట్లు ఒక తేదీని ప్రకటించి బహిర్గతంగా ప్రతిపక్షాలను పిలిచి నల్ల మట్టి పైన వివరణ ఇస్తే ఒకరిపై ఒకరు విమర్శించుకునే సమస్య ఉండదని అన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే మౌనం వీడి సమాధానం చెప్పకపోతే ఒకరినొకరు విమర్శిం చుకుని ప్రజా సంఘాలు, కుల సంఘాలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం చెడుతుందన్నారు. ఇది గొడవలకు దారి తీసే అవకాశం ఉందని అన్నారు. కావున ఎమ్మెల్యే నల్లమట్టి విషయంలో త్వరగా స్పందించాలన్నారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లా బీసీ యువజన సంఘం ప్రధాన కార్య దర్శి రాజు గౌడ్, తెలకపల్లి మండల అధ్యక్షుడు రాజు యాదవ్, మల్లేష్ ముదిరాజ్, దివాకర్ గౌడ్, నితిన్ యాదవ్, నవీన్, శ్రీనివాస్, పరమేష్, శంకర్, రాము, భీమేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.