Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఈఓకు బీఎస్పీ నాయకుల వినతి
నవతెలంగాణ- ధరూర్
జోగులాంబ గద్వాల జిల్లాలోని పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటూ బీఎస్పీ నాయకులు సోమవారం డీఈఓ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జి ఎం.సి. కేశవ రావు మాట్లాడుతూ జిల్లాలోని అనేక మండలాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువ ుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేద కుటుంబాలు తమ పిల్లల ను ప్రైవేట్ స్కూళ్ల లో చదివించ లేక ఉపాధ్యాయులు లేని ప్రభుత్వ పాఠశాలకు పంపించ లేక ఇంటి దగ్గర ఉంచడం లేదా పనులకు పంపిస్తున్నారన్నారు. అధికారులు స్పందించి ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఏర్పాటు చేయాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి విద్యపై పట్టింపు లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మాణికుమార్ ,గద్వాల నియోజకవర్గ అధ్యక్షులు యేసురాజు, ఉపాధ్యక్షులు చైతన్య కిరణ్, ప్రధాన కార్యదర్శి రవి కుమార్, పట్టణ కోశాధికారి నాగరాజు, పట్టణ అధ్యక్షలు మండ్ల రవి, ప్రదీప్, మహీందర్, రవి, తదితరులు పాల్గొన్నారు.