Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెరువులు కుంటలు సర్కారు భూముల్లో పాగా
- మీడియాలో వచ్చినప్పుడే చర్యలు అంటూ హడావుడి
- ఎమ్మెల్యేలు ఆదేశించినా కదలని అధికారులు
- కబ్జాదారుల పై చర్యలు తీసుకోవాలి : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు
సర్కారు భూములైన చెరువులు ఎవరైనా కబ్జాలకు పాల్పడితే వారి పై కఠిన చర్యలు తప్పవు. అధికారులు ముందుగా ఎఫ్టీఎల్ నిర్ణయించి హద్దులు ఏర్పాటు చేయాలి.ప్రభుత్వ భూములు ఎవరైనా కబ్జాలకు గురవుతుంటే స్వాధీనం చేసుకుని వెంటనే కాళ్లు పాదాలు. కబ్జాలకు పాల్పడిన వారు ఎంతటి వారినైనా వదిలేది లేదంటూ సాక్షాత్తు ఎమ్మెల్యేలు చెప్పిన అధికారులు అడుగు కూడా కలవడం లేదు.కబ్జాదారులు భూములను వదులుకోక పోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని పలు పార్టీల నాయకులు హెచ్చరిస్తున్నారు.
నవతెలంగాణ- మహబూగర్ ప్రాంతీయ ప్రతినిధి
మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న పెద్ద చెరువు పరిస్థితి మరీ దయనీయం. శిఖం 160 ఎకరాలు ఉండేది. ఇప్పుడు 120 ఎకరాలు మాత్రమే ఉంది. 40 ఎకరాలు కబ్జాకు గురైంది. రెవెన్యూ చిన్న నీటి పారుదల శాఖ మున్సిపల్ అధికారులు సర్వే చేసి హద్దులు నిర్ణయించారు. హద్దులను నిర్ణయించిన తర్వాత సైతం కబ్జాలకు పాల్పడు తున్నారు. ఎఫ్టీఎల్ లోపల ఆరు ఎకరాలు కబ్జాకు గురైంది. మంత్రి శ్రీనివాస్ చొరవతో ఈచెరువును ట్యాంకు బండ్‌గా మారుతున్నారు.రూ. 100 కోట్లు కేటాయించారు. అయితే చెరువు మధ్యలో రోడ్డు వేయడం పట్ల పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట, గద్వాలలో సైతం ప్రధాన చెరువులు కబ్జాకు గురైన విషయం తెలిసిందే. అచ్చంపేట పట్టణంలో ఉన్న మల్లం కుంట నామరూపాలు లేకుండా పోయింది.ఎనిమిది ఎకరాలు మొత్తం సుఖం ఉండగా రెండు ఎకరాలు కబ్జాకు గురైంది. బఫర్ జోన్లో ఉన్న ఇండ్లను కొన్నిటిని కూల్చి వేసినప్పటికీ కబ్జాదారులు కలవడంలేదు.ఇప్పటికైనా అధికారులు స్పందించి సర్వే చేసి చెరువులను కాపాడాలని పలువురు పార్టీలు ప్రజా సంఘాలు కోరుతున్నారు. ప్రభుత్వ స్థలాలు కుంటలు, చెరువులంటే రియల్ మాఫియాకు పలహారంగా మారింది. వనపర్తి పట్టణ సమీపంలో ఉన్న తాళ్ళచెరువు కొంతమంది రెండు వందల ఎకరాలకు పైగా ప్లాట్లు చేసి అమ్ముక ున్నారు. ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్ళింది. అయినా రియల్ మాఫియా వెనక్కి తగ్గడం లేదు. నాగర్ కర్నూల్ కేసరి సముద్రం కథ అంతుచిక్కని వ్యవహారంగా ఉంది. నాగర్ కర్నూల్ శిఖంలో కొంత మంది రైతులు తమ పొలాలను సాగు చేసుకుంటున్నారు. మరి కొంతమంది రియల్ వ్యాపారులు సాగు భూములను కొన్ని రియల్ భూములుగా మార్చారు. కొంతమంది వ్యాపారులు ఫామ్‌హౌస్‌లను నిర్మించారు. అధికారులు చర్యలు తీసుకోక పోవడంతో అనేకమంది గందరగోళంలో పడ్డారు. నాగర్‌కర్నూల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించిన స్థలాన్ని కొంతమంది కబ్జా చేసుకున్నారని పలువురు తెలిపారు. కాగా కబ్జాదారుల నుంచి భూమిని స్వాధీనం చేసుకొని హద్దులు నిర్ణయించాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు. అయినా అధికారులలో చలనం కనబడటం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను భూములను స్వాధీనం చేసుకోవాలని పలు రాజకీయ పార్టీలు కోరుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వేలాది ఎకరాల దేవాదాయ పోరంబోకు కారీదు ఖాతా ఇలాంటి భూములు ఉన్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం 50 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ దేవాదాయ భూములు వివిధ భూస్వాముల చేతుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా నా జిల్లా అధికారులు స్పందించి రియల్ మాఫియా చేతిలో ఉన్న భూములను స్వాధీనం చేసుకొని పేదలకు అందజేయాలని కోరుతున్నారు. అవినీతి అక్రమాలను నిర్మూలించడానికి నిరంతరం ప్రక్రియ కొనసాగాలి. అప్పుడే పారదర్శకంగా పాలన సాగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో హద్దులు నిర్ణయించి బోర్డులు పెట్టాలి. వేలాది మంది ఇంటి నిర్మాణం కోసం సొంత జాగాలో లేక ఇబ్బందులు పడుతున్నారు. కబ్జా కోరల్లో నుంచి జరగాలని వినిపిస్తే వేలాది మందికి ఇంటి స్థలం లభించే అవకాశాలున్నాయి.
ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకోవాలి
జిల్లా అధికారులు ప్రభుత్వ భూములను కబ్జా చేసు కున్న వారిని ఎందుకు ఉపయోగి స్తుందో తెలియడం లేదు. రియల్ వ్యాపారుల నుంచి మామూలు తీసుకుంటున్న అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదు.జిల్లా అధికారులు తమ వైఖరిని మార్చుకుని కబ్జా చేసుకున్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి. తాజాగా లేని నిరుపేదలకు ఫలాలను అందజేయాలి. అప్పుడే అధికారులపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది.
వర్ధన్ పర్వతాలు,
- సీపీఐ(ఎం) నాగర్‌కర్నూల్ జిల్లా కార్యదర్శి