Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - మహబూబ్ నగర్
జిల్లాలోని అన్ని పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులకు తెలిపారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ప్రభుత్వం పాఠశాలలకు వారం రోజులపాటు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందేనన్నారు. తిరిగి పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో పారిశుద్ధ్య పనులు వెంటనే చేపట్టాలన్నారు. రెవెన్యూ అధికారులు వర్షానికి కూలిపోయిన ఇండ్లను ఫోటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. జిల్లాలో 1474 చెరువులు ఉండగా 41 చెరువులు అలుగు పారినట్లు తమ దగ్గర సమాచారం ఉందన్నారు. చెరువులకు గడ్లు పడిన ,తెగిపోయిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు ప్రజావాణిలో 92 ఫిర్యాదులు అందినాయన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదన కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
కందనూలు : ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఉదరు కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 61 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు 829 ఫిర్యాదులు అందగా 419 ఫిర్యాదులు పరిష్కారం చేశామన్నారు.32 ఫిర్యాదులు ఇతర శాఖలకు బదిలీ చెయ్యగా మిగిలిన 378 ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. వాటిని వెంటనే పరిష్కారం చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ మోతిలాల్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.
ధరూర్ : జిల్లా లో ప్రజావాణి ద్వారా వచ్చిన పిర్యాదులను శాఖల వారిగా పెండింగ్ ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ ఇప్పటివరకు శాఖల వారిగా ప్రజా వాణిలో 60 దరఖాస్తులు వచ్చాయన్నారు.భూ సమస్యలు ఎక్కువగా వచ్చాయనీ తెలిపారు.కార్యక్రమంలో ఏఓఆజం అలీ,జిల్లాఅధికారులు, పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్ : పేట జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాల యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పేట జిల్లా వ్యాప్తంగా 9 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీఎన్. వెంకటేశ్వర్లు తెలిపారు.7 ఫిర్యాదులు భూతగాథాలకు సంబంధించినవి 2 ఫిర్యాదులు కుటుంబ కలహాలకు సంబంధించినవి వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు చట్ట ప్రకారం గా పరిష్కరించాలని ఫోన్ ద్వారా ఎస్పీ అధికారులకు ఆదేశించారు
వనపర్తి :ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్ని శాఖల అధికారులకు ఆదేశించారు. సోమవారం ఐ డి ఓ సి. ప్రజావాణి సమావేశ మందిరంలో ఆమె ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి లబ్ధిదారుల ద్వారా అందిన దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారుల నుండి (25) ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కందనూలు : ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి 10 మంది ఫిర్యాదు దారులు వచ్చారు. ఫిర్యాదు దారులతో జిల్లా ఎస్పీ కె మనోహర్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆధికారులకు ఎస్పీ ఆదేశించారు.