Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఎస్యూఐ నాయకుల డిమాండ్
నవతెలంగాణ- పెబ్బేరు
పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోగల ప్రభుత్వ మహిళ పాలిటెక్నిక్ కళాశాల వసతిగృహాన్ని వెంటనే ప్రారంభించాలని ఎన్ఎస్యూఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం వారు పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలను కళాశాల ప్రిన్సిపాల్ రమేష్తో చరించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ 2020 సంవత్సరంలో వసతి గహం నిర్మాణం పూర్తయిన ఇప్పటివరకు ప్రారంభించకపోవడం సిగ్గుచేటన్నారు. హాస్టల్ నేటికి ప్రారంభము కాకపో వడంతో నిరుపేద విద్యార్థినులు పెబ్బేరు పట్టణంలో ప్రయివేటు హాస్టల్ లలో నెలకు వేలకు వేలు వెచ్చిస్తున్నారన్నారు. దీంతో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే వసతి గహాన్ని అందుబాటులోకి తెచ్చి,పేద విద్యార్థులకు ఆర్థిక భారం లేకుండా చూడాలన్నారు. లేదంటే ఆందోళనలు చేపడ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎద్దుల విజయవర్దన్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు గంధం రంజిత్ కుమార్,యుత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ రణధీర్ రెడ్డి, ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు గంధం సునిల్, రాము,బాను,ఆల్వాల సాయి తేజగౌడ్,గంధం ఆంజీ,నాయకులు లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.