Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రామిక వికాస కేంద్రం మండల కోఆర్డినేటర్ మహేష్
నవతెలంగాణ- చిన్నంబావి
బాలలు నాయకత్వం లక్షణాలను పెంపొందించుకోవాలని శ్రామిక వికాస కేంద్రం మండల కో ఆర్డినేటర్ మీసాల మహేష్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని కొప్పునూరు గ్రామంలో బాలల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు పిల్లలు అందరూ బాలలేనన్నారు. ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వం వచ్చి నప్పుడే బాలల సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. బాలలు చిన్ననాటి నుండే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుంటే భావి పౌరులుగా ఎదుగు తారని అన్నారు. బాలల సమస్యలను ఎప్పటికప్పుడు గ్రామంలో ఉన్న ప్రజా ప్రతినిధులు అధికారుల దష్టికి తీసుకు వెళ్లాలని సూచించారు. విద్యా హక్కు చట్టం, బాల కార్మిక వ్యవస్థ. బాల్య వివాహాలు అరికట్టడం, అక్రమ రవాణా, బాలలపై లైంగిక వేధింపులు, తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. ముందుగా బాలల సంఘం సభ్యులు పరిచయం చేసుకొని ఎజెండా అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బాలల సంఘం ప్రతినిధులు అనురాధ, అశ్విత, దుర్గ, లావణ్య, శివ , సాయికుమార్, ఎస్ వి కే ప్రాజెక్టు కోఆర్డినేటర్ తిరుపాల్ యాదవ్, ఎస్.వి కే కమ్యూనిటీ ఆర్గనైజర్ హైమావతి, గ్రామ బాలల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.