Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కందనూలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరఫై నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోందని అందుకు గాను ఆపార్టీ నాయకులను గ్రామాల్లో తిరగనీయమని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. తక్షణమే ఎస్సీి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో మాదిగలకు నమ్మక ద్రోహం చేస్తున్న బీజేపీ మొండి వైఖరి వీడాలన్నారు. లేకుంటే బీజేపీకి తెలంగాణ లో మాదిగల సత్తా చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి సౌట కాశిం ఎమ్మార్పీఎస్ సీనియర్ నేత గుట విజరు ఎం ఎస్ ఎఫ్ జిల్లా కన్వీనర్ మహేష్ ఎరుకల సంఘం నేతలు సిపిఐ నేతలు ఎం ఎస్ ఎఫ్ నాయకులు పవన్, రాంప్రసాద్, ఉదరు, జగదీష్ పాల్గొన్నారు.