Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఉట్కూర్
మండల కేంద్రంలోని ఉప వైద్య కేంద్రంలో సోమవారం నిర్వహించిన వైద్య శిబిరం విజయవంతమైందని డాక్టర్ సాయికుమార్ తెలిపారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు నిర్వహించిన వైద్య శిబిరంలోవైద్య శిబిరంలో 42 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సీజన్లో నీళ్ల విరోచనాలు, ó టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరు కాచి వడబోసిన నీటిని తాగాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి విజయకుమార్ , ఆరోగ్య కార్యకర్త కవిత, ఎల్ టి రాజేష్, ఆశా కార్యకర్తలు, నరసమ్మ, శివమ్మ, సోనీ , మూబిన్, తిప్పమ్మ. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.