Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అచ్చంపేట : బాలికలు , మహిళల రక్షణ కోసమే షీ టీమ్స్ పనిచేస్తాయని, వేధిస్తే మాకు చెప్పాలని షీ టీమ్స్ అచ్చంపేట ఇంచార్జి వెంకట్ నాయక్ తెలిపారు. సొమవారం అచ్చంపేట లోని అర్టిసి బస్టాండు లో నిర్వహించారు. పాఠశాల,కళాశాల విద్యార్థినులకు భరోసా కల్పించారు.నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కె మనోహర్ సార్ ఆదేశాల మేరకు, సూచనలకు అనుగుణంగా బాధిత మహిళల రక్షణ కోసం పోలీసులు 24 గంటలు సేవలను అందిస్తారని ఆయన తెలిపారు. మహిళల భద్రతే లక్ష్యంగా తెలంగాణ పోలిస్ పనిచేస్తుందన్నారు. 2014 సంవత్సరం నుంచి షీ టీమ్ లు అందుబాటులోకి వచ్చాయని , అప్పటి నుంచి మహిళలు , యువతులకు అవగాహన కార్యక్రమాలు , బాధితులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తు పాఠశాలలు , కళాశాలలతో పాటు బస్టాండ్లు , కూడళ్లలో మహిళా సమాఖ్య గ్రూపులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు వెంకటేష్ నాయక్, భీముడు, రమేష్, మాత్యుస్, విద్యార్ధినిలు , తదితరులు ఉన్నారు.