Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్దకొత్తపల్లి : అంగన్వాడీ కేంద్రాలు గర్బిణులకు, బాలింతలకు, చిన్నారులకు ఓ వరం లాంట ివని వీటిద్వారా ప్రభుత్వం నెల నెలా పౌష్టికాహారాన్ని అందిస్తుందని, ఐసిడిఎస్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ, డిఆర్డిఏ శాఖల గ్రామస్థాయి అధికా రులు సమన్వయంతో పనిచేసి అంగన్వాడీల ద్వారా గ్రామాల్లో ప్రజలకు మరింత చేరువుగా పని చేయాలని జిల్లా కలెక్టర్ ఉదరు కుమార్ ఆయా శాఖల అధికారులకు సూచించారు.మంగళవారం జిల్లాలోని 1131 అంగన్వాడీ కేంద్రాల్లో రాష్ట్ర స్థాయిలోనే గర్భిణీలు, ఐసీడీఎస్,పంచాయతీరాజ్, డీఆర్డీఏ, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో అంగన్వాడీల అభివద్ధి, గర్భిణీలు బాలింతలకు చేపట్టవలసిన కార్యక్రమాల ప్రణాళిక సమావేశాన్ని నిర్వహించారు. మండల పరిధిలోని పెద్ద కార్పాముల గ్రామంలో ని రైతు వేదికలో నిర్వ హించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఉదరుకు మార్ పంచాj ుతీరాజ్ డీఆర్డీఏ అధికారులు అంగన్వాిడ కీేంద్రాలతో సమనయంతో పనిచేసి నాగర్ కర్నూల్ జిల్లాలోని ఒక్కో అంగన్వాడి కేంద్రాన్ని ఆరోగ్య నిల యంగా మార్చాలన్నారు.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి చిన్నపిల్లల ఎదుగుదలలో సమస్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని జిల్లాలో చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న పౌష్టి కాహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. లైబ్రరీలో ఉన్న పుస్తకాలను ఆయన పరిశీ లిం చారు అనంతరం అయితే రైతు వేదికలో ఉన్న నర్సరీని పరిశీలించి మొక్కలు నాటారు.రైతుల ఇన్సూరెన్స్ పంటల సాగు తదితర వివరాలను మండల వ్యవసాయ అధికారిని రమేష్ నాయక్ ను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్ర మంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని టి యు వెంకటలక్ష్మి, అదనపు డిఎంహెచ్వో వెంకట దాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సొసైటీ సభ్యులు శ్రీనివాస్, పాలెం కషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆఫీసాజాహన్,ఐసిడిఎస్ కొల్లాపూర్ వెంకటరమణ, వివేకానంద వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి రామకష్ణ, స్థానిక తహసిల్దార్ రవికుమార్ ఎంపీడీవో కష్ణయ్య ఏవో రమేష్, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి లక్ష్మణ్ నాయక్, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.