Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- జడ్చర్ల
పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టక పోవడాన్ని నిరసిస్తూ మంగళవారం ఎమ్మా ర్పీఎస్ జిల్లా కో కన్వీనర్ వినోద్ మాదిగ ఆధ్వ ర్యంలో జడ్చర్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. 28 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై పోరాడుతూనే ఉన్నా మని తెలిపారు. ఎన్నికల సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే వర్గీకరణ బిల్లు పెడతామని చెప్పి ఎనిమిది సంవత్సరాలు గడుస్తు న్న దాని గురించే మాట్లాడడం లేదన్నారు. వర్గీకరణ విషయంలో 8 నిమిషాలు కూడా మాటా ్లడకుండా మాదిగలను, ఉప కులాలను మోసం చేస్తూ కాలం వెల్లదీస్తున్న బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బిజెపి నాయకులు పగటి కలలు కంటున్నారని బిజెపి చేసిన మోసాన్ని గ్రామాల్లో ప్రజలకు తెలియజేసి వారిని తిరగనివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుకుం టామని హెచ్చరించారు. ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి ఉమ్మడి మహబూ బ్‌నగర్ జిల్లా కన్వీనర్ టైగర్ జంగయ్య మాదిగ, ఎమ్మార్పీ ఎస్ జిల్లా కన్వీనర్ రాజు మాదిగ, జిల్లా కో కన్వీనర్ బచ్చల్ల వినోద్ మాదిగ, ఎమ్మెస్పీ నాయకులు దగ్గుల బాలరాజ్ మాదిగ, యాదయ్య మాదిగ, శివ మాదిగ, యాదయ్య మాదిగ, అల్లాజి, రవి మాదిగ, శ్రీపతి మాదిగ, యాదయ్య మాదిగ, జంగయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.