Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంగన్వాడీ సూపర్వైజర్ బీపాషా
నవతెలంగాణ- అచ్చంపేట రూరల్
గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేస్తున్న పౌష్టికాహారంతో పాటు మం దులు వేసుకోవాలని అంగన్వాడీ సూపర్వైజర్ బీపాసా అన్నారు. మంగళవారం పట్టణంలోని 10వ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింత లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆకుకూరలు, పండ్లు, గుడ్లు తినాలని సూచించారు. అనంతరం గర్భిణులకు సామూహక సీమంతం నిర్వహించారు. ఫ్రీ స్కూలుకు క్రమం తప్పకుండా పిల్లలను పంపిం చిన తల్లులకు కౌన్సిలర్ శ్రీను బహుమతులు అంద జేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మన్ను పటేల్, వెంకటేష్, అంగన్వాడి టీచర్ సంధ్య, కో-ఆర్డినేటర్ సాహితి, ఆయా సుమతి తదితరులు పాల్గొన్నారు.
అక్షరాభ్యాసం
కోడేరు: మండలంలోని రేకులపల్లి గ్రామంలో ని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి సర్పంచ్ లాల్సింగ్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనం త రం బాలింతలు, గర్భిణులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేష్ కుమార్ ఏఎన్ఎం రేష్మ , వార్డు సభ్యుడు హనుమంతు నా యక్, అంగన్వాడీ టీచర్ చిట్టెమ్మ, ఆశ వర్కర్ షా హిన్, వల్లమ్మ, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.