Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ -నారాయణపేట
జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ కమాన్ దగ్గర మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకొని హోటల్ నిర్వహిస్తున్నా మునిసిపల్ అధికారులు పట్టించు కోవడం లేదని స్థానిక ప్రజలు అంటున్నారు. కమాన్ దగ్గర ద్విచక్ర వాహ నాలు నిలపడానికి స్థలం లేక ప్రజలు నానా ఇబ్బందులకు గురవు తున్నారన్నారు. వాహనాలకు పార్కింగ్ స్థలం లేక రోడ్డుపై వాహనాలు నిలిపి తే పోలీసులు జరిమానలు విధిస్తు న్నారన్నారు. ఇప్పట్టికైనా మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డుపై నిర్వహిస్తున్న హోటల్‌ను తొలగించి అక్కడ వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు మున్సిపల్ అధికారులు హోటల్ తొలగించక పోతే అది కబ్జాకు గురవుతుందంటున్నారు. అధికారులు లక్షల విలువ చేసే స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని వారు కోరుతున్నారు.