Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అడిషనల్ డీఆర్డిఓ శ్రీనివాసులు
నవతెలంగాణ- తెలకపల్లి
మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వం, బ్యాంకులు అందిస్తున్న సహకా రాన్ని సద్వినియోగం చేసుకొని వ్యాపార రంగంలో రాణించాలని నాగర్ కర్నూ లు జిల్లా అడిషనల్ డీఆర్డీిఓ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని శ్రీశక్తి భవనంలో నిర్వహించిన మండల మహిళా సమాఖ్య కార్య వర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ మహిళలు గ్రామ సంఘం పొదుపులు, అంతర్గత అప్పులు, బ్యాంకు లింకేజీ, సామాజిక పెట్టుబడి నిధి, శ్రీనిధి, వంటి వాటిపై, సమాజంలో జరుగుతున్న మార్పుల పై అవగాహన పెంచుకోవాలన్నారు. హరితహారం లోభాగంగా ప్రతి సభ్యురాలు 10 మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. వికలాంగులచేత సం ఘాలు ఏర్పాటు , పెన్షన్ కు దరఖాస్తు చేయించడం, సదరం సర్టిఫికెట్ కోసం జిల్లాకు పంపించడం వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. సంగమేశ్వర గ్రామీణ వికాస బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులను సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం ఐబీ శ్రీనివాసులు , శ్రీనిధి ఆర్ఎం రామచంద్రుడు, ఏపీఎం నిరంజన్ నాగరాజు , సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి. ఈసీ సభ్యులు కాశమ్మ, చంద్రకళ ,రామ చంద్రమ్మ పార్వతమ్మ లలితమ్మ కుమిదవల్లి ,సీసీలు సుజాత, సుగుణయ్య , నిరంజన్, రాము, వివో ఏలు ఖజాజీ, విజయ, సుధాభార్గవి, ఉమా , అరుంధతి, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు.