Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శ్రీహర్ష
నవతెలంగాణ- ధరూర్
జిల్లాలో కాలుష్య పరిశ్రమల వల్ల పర్యావరణం దెబ్బతింటోందని కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను గుర్తించి నివేదిక అందించాలని జోగు లాం బ గద్వాల జిల్లా కలెక్టర్ శ్రీహర్ష తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు సభ్యు లను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాలుష్య నివారణపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇటి క్యాల మండలం కొండేరు గ్రామ సమీపంలోని ఓపరిశ్రమ నుండి వ్యర్థ పదా ర్థాలు విడుదల అవుతున్నాయన్నారు. అందుకు సంబంధించి దినపత్రికల్లో వచ్చిన కథనాలను అధికారులకు వివరించారు. జిల్లాలోని పరిశ్రమలను తనిఖీ చేసి కాలుష్యం వెదజల్లే పరిశ్రమల నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో రాములు, డిపిఓ శ్యాంసుందర్, మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్, కాలుష్య నియంత్రణ బోర్డ్ అధికారి దయానంద్, ఏఈ తస్లీమ్, డాక్టర్ ఇర్షాద్, భూగర్భజలశాఖాధికారి జి.మోహన్ పాల్గొన్నారు.