Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శ్రీరంగాపూర్
మండల కేంద్రంలోని పాత గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం మండల వైద్యాధికారి డాక్టర్ ప్రవలి ఆధ్వర్యంలో క్షయవ్యాధిపై గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగాసర్పంచ్ వినీలారాణి , జెడ్పీటీసీ సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, సింగిల్‌విండో వైస్‌చైర్మన్ వెంకటయ్య పాల్గొని మాట్లాడుతూ మండలంలో టీబీ నివారణ కోసం తెమడ పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్షల్లో టీబీ నిర్దారణ అయితే ప్రభుత్వము ఉచితంగా మందులు పంపిణీ చేస్తుందని తెలిపారు. గతంలో టీబీని గుర్తించాలంటే పట్టణాలకు వెళ్లి పరీక్ష చేయించుకునే వారని ఇప్పుడు మన ఊరిలోనే తెమడను సేకరించి మందులు ఇంటికి వచ్చి ఇస్తున్నారన్నారు. మండల ప్రజలు టీబీ వైద్య శిబిరాలను సద్వినేయోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమం లో వైద్య సిబ్బం ది సత్యమ్మ, వెంకట సుబ్బమ్మ, స్వరూప రాణి, రాజశేఖర్, తిరుపతయ్య, టిబి సూపర్ వైజర్ రత్నయ్య, శ్రీదేవి, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.