Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందుల్లో విద్యార్థులు
- చదువులో వెకబడి పోతారని తల్లి దండ్రుల ఆందోళన
- అ పట్టించుకోని అధికారులు
పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు దాటిపోయినా నేటికీ పాఠ్యపుస్తకాలు అందక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువులు కొనసాగిస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం నెల రోజులు గడిచినా కనీసం పుస్తకాలు కూడా ఇవ్వక పోవడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ మాటలు నమ్మి పాఠశాలల్లో చేర్పిస్తే మా పిల్లలు చదువులో వెనక బడి పోయేలా ఉన్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ -ఉట్కూర్
పాఠశాలలు ప్రారంభమై దాదాపు నెల రోజులు దాటి నా నేటి వరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందలేదు. మండలంలో 20 శాతం మేరకే పుస్త కాలు వచ్చినట్లు విద్యాశాఖ అధికారులు అంటు న్నారు. పాఠ్య పుస్తకాలు అందకపోవటంతో చదువు కోవ డానికి ఇబ్బందికరంగా మారిందని విద్యార్థులు వాపోతు న్నారు. మండలంలో 47 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా దాదాపు 7600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మండల
పరిధిలోని చిన్నపొర్ల ప్రాథమిక పాఠశాలలో దాదాపు 230మంది విద్యా ర్థులు చదువుకుంటు న్నారు వారికి నేటి వరకు పుస్తకాలు అందక పోవడంతో వారికి బేసిక్ విద్య బోధన చేస్తున్నామని ఉపాధ్యా యులు పేర్కొంటున్నారు. నేటి వరకు పాఠ్యపుస్తకాలు అందకపోవటంతో విద్యార్థుల చదువు ఎలా కొన సాగు తుందని విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాఠ్యపుస్తకాలు అందించి తమ పిల్లలకు మెరుగైన విద్య అందేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
20శాతం వచ్చాయి
- ఎంఈఓ వెంకటయ్య
దీనిపై ఎంఈఓ వెంకటయ్యను వివరణ కోరగా మండలానికి దాదాపు 20 శాతం పుస్తకాలు వచ్చాయి మిగితావి త్వరలో వస్తాయని తెలిపారు.
పుస్తకాలు రాలేదు
మాకు ఇప్పట్టివరకు పుస్తకాలు రాలేదు. ఉపాద్యాయులు చెప్పేది తిరిగి చదువుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. వెంటనే పుస్తకాలు ఇవ్వాలి.
- అభినవ్ , 4వ తరగతి విద్యార్థి
దుస్తులు కూడా రాలేదు
ఈ సంవత్సరం ఇప్పట్టి వరకు పుస్తకాలు, దుస్తులు అందలేదు. పుస్తకాలు తొందరగా ఇస్తే మా చదువులు ముందుకు సాగుతాయి.
- మంజునాథ్, 4వ తరగతి విద్యార్థి
అధికారులు స్పందించాలి
అధికారులు స్పందించి ప్రభుత్వ పాఠశాలలో చదువు తున్న విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు త్వరగా అందించాలి.
- అనిల్, 5వ తరగతి విద్యార్థి