Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గోపాలపేట
రిజర్వాయర్లో ముంపుకు గురైన బాధితులకు నష్ట పరిహారం ఇవ్వకుండా ముంచితే రాబోయే కాలంలో ప్రభుత్వానికి గడ్డు కాలం ఎదురు కాక తప్పదని సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం డి జబ్బార్ అన్నారు. మంగళవారం రేవల్లి మండలం బండ రాయిపాకుల గ్రామంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ముంపు నిర్వాసితులు నిరాహార దీక్షకు హాజరై ప్రసంగించారు. గోపాల్పేట మండలం ఏదుల గ్రామంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కు సంబంధించిన శ్రీ వీరాంజనేయ రిజ ర్వాయర్లో ఏదుల, తీగలపల్లి, బండ రాయిపాకుల, కొంకలపల్లి, రేవల్లి గ్రామాలకు సంబంధించిన భూములు రిజర్వాయర్లో పోయాయన్నారు. బండ రాయి పాకల కొంకలపల్లి గ్రామాలు ఇండ్లతో సహా పూర్తిగా మునకకు గురయ్యాయన్నారు. రిజర్వా యర్ ప్రారంభించి ఎనిమిది సంవత్సరాలు గడు స్తున్నా ముంపు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోవడం విడ్డూరంగా మారిందన్నారు. సంవత్సరాల తరబడి ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు.350 కుటుంబాలకు నష్ట పరిహారం అందే వరకు పోరాడుతామని తెలిపారు.ఈ దీక్షలో గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం దేవేందర్ జిల్లా నాయకులు గోపాల్, వెంకటన్న, నాగరాజు, రాములు,చిన్న మల్లయ్య బీసీ ఉద్యమ నాయకులు సురేందర్ గౌడ్, బ్రహ్మయ్య,గంగసాని సుబ్బారెడ్డి. బోడ మౌని శివయ్య, తెలుగు శ్రీరాములు యూత్ నాయకులు రవీందర్, శివ శంకర్ ఆంజనేయులు, వెంకటేష్, మహేష్, మాస్ అమ్మ, అంజనమ్మ, చిన్న మల్లయ్య , జి రాము , మహిళలు, 70 మంది పురుషులు కూర్చున్నారు.