Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొక్కలు నాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ- ఉట్కూర్
మండల పరిధిలోని మగ్దూంపూర్ గ్రామంలో మంగళవారం హరితహారం కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కాళ్ళప్ప, ఈజీ ఎస్ ఏపీఓ ఎల్లయ్య తదితరులు పల్లె ప్రకృతి వనం లో మొక్కలు నాటారు. అలాగే మండల పరిదిలోని కొల్లూరు గేట్ దగ్గర నారాయణపేట, మక్తల్ ప్రధాన రహదారి పక్కన అధికారులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్: మండల పరిధిలోని చింతకుంట గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీిటీసీ సభ్యురాలు జర్పుల కళ్యాణి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటింది గొప్పకాదు నాటిన మొక్కను కాపాడుకోవడం గొప్ప అన్నారు. మన మంతా బాధ్యతగా నాటిన మొక్కలను సంరక్షిస్తే అవి పెరిగి నీడనివ్వడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరి జన నాయకులు లక్ష్మణ్ నాయక్, సర్పంచ్ రేణుక భాస్కర్, పంచాయతీ కార్యదర్శి పాండు, ఐకెపి కోఆర్డినేటర్ కరీం, రాజేశ్వరి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
కొత్తకోట: మండలంలోని ముమ్మలపల్లి గ్రామం, ఉలెంకొండా తండాలో హరితహారం కార్య క్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్ర మానికి ముఖ్యాతిథులుగా వనపర్తి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గుండ్రాతి వామన్గౌడ్, కొత్తకోట మం డల పరిషత్ అధ్యక్షురాలు గుంత మౌనిక మల్లేష్ హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత తీసు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భీమ్ రెడ్డి, పామపురం సింగిల్ విండో చైర్మన్ కొంత్తం వాసుదేవరెడ్డి, టీఆర్ఎస్ మండల జనరల్ సెక్రటరీ అమ్మపల్లి బాలకష్ణ, ఉలెంకొండ సర్పంచ్ నారాయణమ్మ ఠాగూర్ నాయక్, ముమ్మ లపల్లి సర్పంచ్ కురుమన్న, ఉలెంకొండ ఉపసర్పం చ్ ప్రశాంత్, ఎస్టీ సెల్ నాయకులు శంకర్ నాయక్, ముమ్మలపల్లి గ్రామ అధ్యక్షులు రవి, శివ, వెంకటేశ్వర్, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.