Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -కొత్తకోట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సకాలంలో పూర్తి చేయాలని జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంగళవారంకొత్తకోట మండలం విలియంకొండ తాండాలో ముమ్మరంగా జరుగుతున్న డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు పనులను పరిశీలించమని తెలిపారు. పనులు త్వరగతిన పూర్తి చేయాలని కోరారు. అలాగే పనులు కూడా నాణ్యవంతంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట మండల పరిషత్ అధ్యక్షురాలు గుంత మౌనిక మల్లేష్, మాజీ మార్కెట్ చైర్మన్ భీమ్ రెడ్డి, పామపురం సింగిల్ విండో చైర్మన్ కొంత్తం వాసుదేవ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అమ్మపల్లి బాలకష్ణ, సర్పంచ్ నారాయణమ్మ ఠాగూర్ నాయక్, ఉపసర్పంచ్ ప్రశాంత్, బాలు నాయక్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.