Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- వంగూరు
టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్ళకు సీపీఐ(ఎం) భయపడదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శి పర్వతాలు అన్నారు. మంగళవారం వంగూరు మండలం రంగాపూర్‌లో సీపీఐ(ఎం) జనరల్ బాడీ సమావేశం గ్రామ సర్పంచ్ చింత ఝాన్సీ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగాపూర్‌లో సీపీఐ(ఎం)ను లేకుండా చేయాలని కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు సీపీఐ(ఎం) భయపడదన్నారు. టీఆర్ఎస్ నాయకులు గ్రామ అభివద్ధికి సహకరించాల్సిందిగా పోయి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్ని స్తున్నారని అన్నారు. గ్రామ అభివద్ధికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నా సీపీఐ(ఎం) ఆపడం టిఆర్ఎస్ తరమూ కాదని అన్నారు. టీఆర్ఎస్ నాయకులకు చేతనైతే గ్రామ అభివద్ధికి నిధులు తీసుకురావాలని అంతేగాని ఒకరు ఇద్దరు వ్యక్తులను ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకున్నట్లు నటించడం తగదని అన్నారు. ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు చేతనైతే గ్రామాల అభివద్ధికి నిధులు కేటాయించి అభివద్ధిలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. దాని ద్వారా తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామకంఠం భూమి పేదలకు ఇళ్ల స్థలాలకు సీపీఐ(ఎం) సిద్ధంగా ఉందని గుర్తు చేశారు. టిఆర్ఎస్ నాయకులు కూడా అందుకు సిద్ధపడి గ్రామంలో ఇళ్ళ స్థలాలు పేదలకు గ్రామకంఠం భూమి పంచడానికి సిద్ధం కావాలని కోరారు.ఎన్నో త్యాగాలకు సిద్ధమె సీపీఐ(ఎం) పార్టీ కార్యకర్తలు తుదిశ్వాస వరకూ పార్టీ కోసం ప్రజల కోసం పని చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింత ఆంజనేయులు. మండల కార్యదర్శి బాలస్వామి గ్రామ నాయకులు ఎల్లయ్య, నాగయ్య, రాములు, జగన్, సురేష్, రామకష్ణ, మల్లయ్య, పాల్గొన్నారు.