Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో ఉరట
- రేసులో భరత్ ప్రసాద్, శాంతా కుమారి ఉన్న ఫలితం సున్నా
పద్మావతి బంగారయ్య టీఆర్ఎస్ ?నుంచి 2019లో తెల్కపల్లి జడ్పీటీసీ సభ్యురాలిగా పోటీచేసి సుమిత్రపై విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. కాగా, ఆమెకు ముగ్గురు సంతానం ఉండగా, ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ఇద్దరు సంతానమే ఉన్నట్లు పేర్కొన్నారని సుమిత్ర కోర్టుకు వెళ్లారు. సుదీర్ఘ విచారణ అనంతరం నాగర్‌కర్నూల్ సీనియర్ సివిల్ జడ్జి శీతల్ అనర్హురాలిగా ప్రకటించారు..పద్మావతికి హైకోర్టు లో ఊరట రావడంతో మళ్లీ జడ్పీ సీటు సోంతం చేసుకున్నది.దీంతో రేసులో భరత్ ప్రసాద్, శాంతా కుమారిల ఆశాలు నిరాశగా మారింది.
నవతెలంగాణ- కందనూలు
నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతికి ముగ్గురు సంతానం ఉన్నట్లు రుజువు కావడంతో తెలకపల్లి జడ్పీటీసీగా ఆమె ఎన్నిక చెల్లదని ఎలక్షన్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడంతో టీఆర్ఎస్ లో హడావుడి మొదలైంది. పలువురు జడ్పీటీసీలు కుర్చీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు వైస్ చైర్మన్ బాలాజీ సింతోపాటు కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్, కోరుకొండ జడ్పీటీసీ శాంతకుమారి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సహకారం ఉంటుందా అనే అంశంపై చర్చలు సాగుతున్నాయి. పద్మావతి హైకోర్టు లో స్టే వేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి ట్రిబ్యునల్ ఆర్డర్ రాగానే ఫైల్ చేయనున్నట్లు తెలిసింది.
తెలకపల్లి జడ్పిటిసి గా తనతో ప్రమాణ స్వీకారం చేయించాలని పద్మావతి సమీప అభ్యర్థి సుమిత్ర కలెక్టరేట్ జెడ్పి ఆఫీసులకు వినతి పత్రాలు ఇచ్చారు. కోర్టు నుంచి అధికారిక ఉత్తర్వులు అందలేదని జెడ్పీ ఆఫీసర్లు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్ నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పారు కోర్టు ఉత్తర్వులు ఆఫీసియల్ గా వందే అవకాశం ఉంది జడ్పీ సీఈఓ నోట్ ఫైవ్ పెట్టి కలెక్టర్ అప్రూవల్ తీసుకుంటే రెండు రోజుల వ్యవధిలో తెలకపల్లి జడ్పీటీసీగా సుమిత్ర చైర్మన్‌గా వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ తో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. జడ్పీ నోట్ ఫైల్ కలెక్టర్ ఆదేశాలు అమలు చేయడానికి గ్యాప్ దొరికితే పరిస్థితులు మారే అవకాశం లేకపోలేదు. ఈ లోగా పద్మావతి కి హైకోర్టులో స్టే లభిస్తే కొంతకాలం కంటిన్యూ అవుతారు. ఇదంతా పొలిటికల్ లీడర్ల ఆదేశాలు అధికారుల యంత్రాంగం అమలు తీరుపై ఆధారపడి ఉంటుంది
హైకోర్టులో పద్మావతి కి స్టే దొరకకపోతే జడ్పీ చైర్ పర్సన్ పోస్టుకు ఎవరిని ఎంపిక చేసేది ఇంట్రెస్ట్‌గా మారింది.కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్ గోరుకొండ జడ్పీటీసీ శాంతా కుమారి లో ఒకరికి ఛాన్స్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ మేరకు వాళ్లు ఇప్పటికే మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసి రిక్వెస్ట్ చేస్తున్నారు రూల్స్ ప్రకారం జడ్పీ వాయిస్ చైర్మన్ బాలాజీ సింగపూర్ తాత్కాలికంగా చైర్మన్ బాధ్యతలు అప్పగించాల్సి ఉండడంతో తనకే పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు జిల్లా ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.పద్మావతికి హైకోర్టు లో ఊరట రావడంతో మళ్లీ జడ్పీ సీటు సోంతం చేసుకున్నది.దీంతో రేసులో భరత్ ప్రసాద్, శాంతా కుమారిల ఆశాలు నిరాశగా మారింది. పద్మావతికి హైకోర్టు తీర్పు మేరకు కంటిన్యూ అవుతారని తెలిపారు.