Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నంబావి : తెలంగాణలో 100 ఏండ్లైనా బీజేపీ రాదు, బీజేపీ పార్టీ ఒక వ్యాపార పార్టీ ,మతతత్వ పార్టీ అని వ్యవ సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మంగళవారం వ్యవ సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే బీరం .హర్షవర్ధన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆర్ .లోక్నాథ్ రెడ్డి గూడెం గ్రామం లోరూ. 20 లక్షల నిధులతో నూతన పంచా యతీ భవనాన్ని మంత్రి, ఎమ్మెల్యే ప్రారం భించారు. అనంతరం మంత్రి ఎమ్మెల్యే వెల్టూర్ గ్రామ పంచాయతీ లో ఏర్పాటు చేసిన కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్య మంత్రి అయ్యాక తెలంగాణలో పల్లెల అభివద్ధి వేగంగా చేస్తున్నారని గుర్తుచేశారు.సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా అందరికీ అందేలా తెలంగాణ ప్రభుత్వం కషి చేస్తుందన్నారు. దేశ ప్రగతికి పట్టుకొమ్మలయిన పల్లెల వికాసం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కరెంటు బిల్ బకాయిలను 34 లక్షల 12 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు.రైతు పెట్టుబడి సహాయం కింద 9వ విడత రైతుబంధు వరకు 7600 కోట్లు రైతుబంధు ఇచ్చామని ఆయన తెలిపారు. కరుణ పరిస్థితులు ఆర్థిక కరువు సంభవించిన ఎనిమిది వేల కాలంలో మూడు లక్షల 68 వేల కోట్లు పన్ను రూపంగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని ఆయన తెలిపారు కేంద్రం నుంచి ఎలాంటి సహాయం లేదన్నారు.గతంలో వరి పండించడంలో పంజాబ్ బ్ మొదటి స్థానం ఉండేది ఇప్పుడు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వరిని తెలంగాణ రాష్ట్రం పండిస్తుందని తెలిపారు తెలంగాణలో 100 ఏళ్లయిన బీజేపీ రాదు, బిజెపి పార్టీ ఒక వ్యాపార పారీ,్ట మతతత్వ పార్టీ అని ఆయన ఎద్దెవా చేశారు. అనంతరం మండల కేంద్రంలో బాలికల కస్తూర్బా గాంధీ ఓ సతి గహ నూతన భవనాన్ని ప్రారం భించారు. కార్యక్రమంలో ఎంపీపీ సోమేశ్వరమ్మ జడ్పీటీసీ వెంకటరమణమ్మ , సింగల్ బండ చైర్మన్ బి. నరసింహారెడ్డి అధికారులు సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.