Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగు ఉపాధ్యాయునిగా సాహిత్యం పట్టు
- నవతెలంగాణతో వేదర్తి మాదాసుధన్ శర్మ
నవతెలంగాణ- పెంట్లవెళ్లి
పెంట్లవెళ్లి మండలం ఆయన ఒక తెలుగు భాషో పాధ్యాయుడిగా, కవిగా, రచయితగా, విమర్శకుడిగా, ఆకాశవాణి ద్వారా ప్రసంగికుడిగా,ఒక సాహితీ సంస్థ నిర్వాహకుడిగా,తన బహుముఖ ప్రజ్ఞాపాటవాలతో తెలుగు భాషామ తల్లికి విశేషమైన సేవ చేస్తూ,ముందుకు సాగుతున్నారు.ఆయన ఎవరో కాదు.నాగర్ కర్నూల్ జిల్లా,పెంట్లవెళ్లి మండల కేంద్రములోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న వేదార్థం మధుసూదన శర్మ.
జీవన ప్రస్థానం : కొల్లాపూర్ మండలం యన్మనబెట్ల గ్రామానికి చెందినవారు. వేదార్థం శేషాచార్యులు, సుగుణమ్మ దంపతులకు వీరు జన్మించారు.ప్రాథమిక విద్య సొంత ఊరిలో,హైస్కూల్ విద్య సింగోటంలో,ఉన్నత విద్య హైదరాబాదులో పూర్తి చేసుకుని,కడప జిల్లా ప్రొద్దుటూరు లో తెలుగు పండిత శిక్షణ పూర్తి చేసుకున్నారు.
ఉద్యోగ ప్రస్థానం : తెలుగు భాషో పాధ్యాయులుగా ఉద్యోగములో ప్రవేశించి,దగడపల్లిలో 2002 నుండి 2009 మే నెల వరకు,పెంట్ల వెల్లి,హైస్కూల్లో 2009 జూన్ నుండి పనిచేస్తున్నారు. భాషా సేవ తెలుగు ఉపాధ్యాయుడిగా, తెలుగు భాషా మాధుర్యాన్ని తెలియజేసే విధంగా విద్యార్థుల కు పద్యాలు, గేయాలు, కథలు ,నాటకాలు, నాటికలు,ఏకపాత్రాభినయాలు,వ్యాసరచన,కథా రచన,ఉపన్యాసం తదితర ప్రక్రియలలో శిక్షణను ఇస్తున్నారు.వివిధ సాహితీ,సాంస్కతిక సంస్థలు,గ్రంధాలయ సంస్థలు నిర్వహించే పోటీలలో ఈ విద్యార్థులు పాల్గొని,బహుమతులు గెలుచుకున్నారు.
సంస్థాగత సేవ : మధుసూదన శర్మ తన మిత్రుడు ఆమని కృష్ణతో కలిసి 2010 సంవత్సరంలో కొల్లాపూర్ పట్టణములో ''తెలుగు భారతి'' అనే సాహితీ సాంస్కతిక సంస్థను స్థాపించారు.దీని ద్వారా భాషా సాహిత్యాలకు ఎనలేని కృషి చేస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించే విధంగా,వారికి తెలుగు భాషా పరిమళాలు పంచే విధంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.పద్య పఠనంలో శిక్షణను ఇచ్చి,ప్రతీ సంవత్సరం ఒక శతకముపై కంఠస్థ పాటీలను నిర్వహించి, నగదు బహుమతులతో పాటు ''బాల ప్రవీణ'' వంటి బిరుదులను ప్రదానం చేస్తున్నారు.మాజీ మంత్రి జూపల్లి కష్ణా రావు సహకారంతో 2018 లో కొల్లాపూర్ లో శతాధిక కవుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించి, కవులను,రచయితలను సన్మానించారు.
కవిగా,రచయితగా : మధుసూదన శర్మ అనేక సాహిత్య,ఆధ్యాత్మిక అంశాలతో కూడిన వందలాది వ్యాసాలు రచించారు.అవి అనేక దిన,పక్ష,మాస పత్రికలలో ప్రచురితం అయ్యాయి.అనేక సామాజిక అంశాలతో కవితలు కూడా రాశారు.అవి వివిధ పత్రికలలో అచ్చు అయ్యాయి.ఆకాశ వాణి, దూరదర్శన్ లలో ప్రసారం అయ్యాయి.తిరుమల తిరుపతి దేవస్తానములు,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, అనేక మంది దాతల ఆర్థిక సహాయముతో ముద్రించారు.ఇవి అనేక మంది సాహితీ జిజ్ఞాసువులకు,పరిశోధకులకు ఉపయోగపడడమే గాక,భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో పాటు పలువురు ప్రముఖుల ప్రశంసలను అందుకున్నారు.
సేవలకు గుర్తింపు : కవిగా,రచయితగా,తెలుగు భాషో పాధ్యాయునిగా,ఆకాశవాణి ప్రాసంగికునిగా,తెలుగు భారతి సంస్థ ప్రధాన కార్యదర్శిగా తెలుగు భాషా సాహిత్యాలకు విశేషమైన సేవలు చేస్తున్న మధుసూదన శర్మ కృషిని గుర్తించి,అటు ప్రభుత్వం,ఇటు పలు సాహితీ, సాంస్కతిక సంస్థలు అనేక పురస్కారాలతో సత్కరించాయి.