Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉట్కూర్
మన ఊరు మన బడి పథకంలో ప్రభుత్వ బడులను పటిష్ట పరిచి ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచాలని తెలంగాణ ప్రాంత ఉపా ధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి నరసింహ అన్నారు. గురువారం మండలంలోని పాఠశాలల్లో సంఘం నాయకులు రవికుమార్ ఆధ్వర్యంలో న సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పాఠశాలలో పారిశుధ్య కార్మికులను నియమించాలని, విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేయాలని, 317 జీవో వల్ల నష్ట పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మోగ్దుంపుర్, బిజ్వర్, పులిమామిడి, కొత్తపల్లి, అవుసలోనిపల్లి,పెద్దజట్రం, అమీన్ పూర్, పగిడిమారి, వల్లంపల్లి పాఠశాలల్లో సభ్యత్వ నమోదు చేయించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల గౌరవ అధ్యక్షుడు నర్సింగప్ప, మండల కార్యదర్శి కష్ణ, మీడియా ఇన్ఛార్జి కిరణ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు దనుంజయుడు, చంద్రశేఖర్, మండల నాయకులు గోపాల్, కష్ణ,బన్నేష్,విజయలక్ష్మి, రాములు, నర్సిములు,భాస్కర్, గణప,మోహన్ రావ్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.