Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పశుసంవర్ధక శాఖాధికారులు
- జీవాలకు టీకాలు వేసిన అధికారులు
టీకాలతో మూగ జీవాలకు రక్షణ ఉంటుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ తమ జీవాలకు టీకాలు వేయించుకోవాలని పశుసంవర్ధక శాఖాధికారులు గొర్రెల కాపరులకు సూచించారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల్లో పశుసంవర్ధక శాఖాధికారులు, మండల పశువైద్యాధికారులు గురువారం గొర్రెలకు టీకాలు వేసి మాట్లాడారు.
నవతెలంగాణ - ఆత్మకూరు
మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ప్రాంతీ య పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వ ర్యంలో సిబ్బంది 1800 గొర్రెలకు టీకాలు వేశారు. కార్య క్రమంలో పశువైద్యాధికారి రమేష్, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ నిర్మల, సిబ్బంది మహమూద్, సిరాజ్, గొర్రెల పెంపకం దారులు పాల్గొన్నారు.
తెలకపల్లి : మండలంఓలని జమిస్తాపూర్, రాంరెడ్డిపల్లి గ్రామాల్లో జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి జీవీ.రమేష్, సిబ్బంది 1213 గొర్రెలకు నట్టల నివారణ టీకాలు వేశా రు. కార్యక్రమంలో పశువైద్యాధికారి నాగరాజు యాదవ్, సహాయకులు శ్రీశైలం, నాగమల్లేశ్వర రావు, శ్యాం తదిత రులు పాల్గొన్నారు.
ఉండవెల్లి : మండల కేంద్రంలోని పశువైద్య శాల ఆవర ణలో జిల్లా పశువైద్యాధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది 2390 జీవా లకు టీకాలు వేశారు. కార్యక్రమం లో పశువైద్యాధికారిణి శిరీష, డాక్టర్ సతీష్, వెంకటేశ్వర్లు, సిబ్బంది శివ తదితరులు పాల్గొన్నారు.
బల్మూరు : మండల కేంద్రంలో చేపట్టిన టీకాల కార్యక్ర మాన్ని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి జీవీ.రమేష్ పరిశీ లించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.