Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
- చెక్ డ్యాం, ఎస్సీ వసతి గృహం, గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ప్రారంభం
- కేంద్రం ధరలు పెంచడం దారుణం
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా జి ల్లాలోని చెరువులు నింపి, వాగులపై చెక్ డ్యాములు నిర్మించి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పునరుద్ఘటించారు. మహబూబ్న గర్ జిల్లా హన్వాడ మండలంలోని వేపూరు గ్రామ శివా రులో రూ.2.89కోట్లతో నిర్మించిన చెక్ డ్యామ్‌ను గురువా రం ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వాలు నీటిని ఒడిసి పట్టుకోకపోవడం, భూగర్భ జలాల పెంపుపై దష్టి సారించలేదన్నారు. ఫలితంగా మహబూబ్‌నగర్ లాంటి జిల్లాలు ఎడారిగా మారాయన్నారు. తమ ప్రభుత్వం అధి కారంలోకొచ్చిన తర్వాత జిల్లాలోని దేవరకద్ర నియోజక వ ర్గం, హన్వాడ మండలంలో నిర్మించిన చెక్ డ్యాముల వల్ల భూగర్భ జలాలు పెరిగాయన్నారు. దీనివల్ల చుట్టుపక్కల బోర్లలో నీటిమట్టం పెరిగిందని, రైతులు సంతోషంగా పం టలు సాగు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. జిల్లాలో చేపట్టిన చెక్ డ్యాముల నిర్మాణాల వల్ల జాతీయ స్థాయిలో జిల్లాకు స్కోచ్ అవార్డులు వచ్చాయన్నారు. భవిష్యత్‌లో తెలంగాణ అంటే వ్యవసాయం అనే రీతిగా తీర్చిదిద్దుతుం టే కేంద్ర ప్రభుత్వం మాత్రం వ్యవసాయ అనుబంధ రంగా లైన పాడి, పాల ఉత్పత్తులపై కూడా జీఎస్టీలను విధించ డం దుర్మార్గమన్నారు. అంతకుముందు మండల కేంద్రంలో 4.90లక్షతో ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడా ప్రాంగణం, ఎస్సీ వసతి గృహాన్ని ప్రారంభించి కాసేపు పిల్లలతో కబాడ్డీ, వాలీబాల్ ఆడారు. అనంతరం విద్యార్థులకు అన్ని రకాల వస్తువులతో కూడిన కిట్టు, ట్రంక్ పెట్టెను అందజేయగా పారిశుధ్య కార్మికులకు రెడ్‌క్రాస్ సొసైటీ పోగు చేసిన హైజ నిక్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఎస్ఈ చక్రధరం, ఈఈ దయానంద్, డీఈ మనోహ ర్, సాంఘీక సంక్షేమ శాఖ డీడీ యాదయ్య, డీఆర్డీఓ యా దయ్య, జెడ్పీటీసీ విజ యనిర్మల, ఎంపీపీ బాలరాజు, తహ సీల్దార్ బక్క శ్రీనివాసులు, ఎంపీడీఓ ధనుంజయ గౌడ్, ఏఈ మహమ్మద్ థౌపిక్ అహ్మద్, వైస్ ఎంపీపీ లక్ష్మి మోహ న్, మాజీ జెడ్పీటీసీ కరు ణాకర్ గౌడ్, రైతుబంధు కో-ఆర్డి నేటర్ రాజు, పీఏసీఎస్ అధ్యక్షుడు వెంకటయ్య, రెడ్ క్రాస్ అధ్యక్షులు లయన్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.