Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్ ఫ్లో 85,500 వేల క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 69,938 క్యూసెక్కులు
- పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు
- ప్రస్తుతం 4.554 టీఎంసీలు
నవతెలంగాణ - ధరూర్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వరప్ర దా యిని అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన నారా యణపూర్ నుంచి 27,450 క్యూసెక్కులు, ఆల్మట్టి నుంచి 20 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో జూరాలకు 85,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీం తో 6 గేట్లు ఎత్తి 24,120 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.657టీ ఎంసీలు కాగా ప్రస్తుతం 4.554 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 40, 918 క్యూసెక్కుల నీటిని ఉపయో గించి 6 యూనిట్లలో 234 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. యథా విధిగా జూరాల నుంచి నెట్టెంపా డుకు 1500 క్యూసెక్కు లు, భీమా -1కు 1300, భీమా-2కు 750 క్యూసెక్కు లు, ఎడమ కాల్వకు 920 క్యూసెక్కులు, కుడి కాల్వకు 590 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు-0 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మొత్తం మీద దిగువ ప్రాంతానికి 69,938 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు తెలి పారు. అయితే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.