Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- అమరచింత
ఎస్టీ కార్పొరేషన్ రుణల మంజూరులో అక్ర మాలు జరిగాయంటూ మండల పరిధిలోని చంద్రప్ప తండా గిరిజనులు గురువారం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ సం దర్భంగా తండావాసులు మాట్లాడుతూ ఎస్టీ కార్పొరేషన్ రుణాలు విషయంలో అర్హులైన పేదల కు ఎవరికీ అందకుండా అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ శిల్ప తన కుటుం బం లోని ఏడుగురికి రుణాలు తీసుకుందన్నారు. ఇదెక్కడి న్యాయమని సర్పంచ్ నిలదీయగా ఆమె ఏమి సమాధానం చెప్పడం లేదనారు. తండాలో చాలా మంది అర్హులు ఉన్నారని వారిని గుర్తించి కార్పొరేషన్ రుణాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రప్ప తండా వాసులు పాల్గొన్నారు.