Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్వానంగా రహదారులు
- ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
- పట్టించుకోని పాలకులు, అధికారులు
గ్రామాలకు వెళ్లే రహదారులతో పాటు అంతర్గత రోడ్లు చినుకు పడితే చిత్తడి చిత్తడిగా మారుతున్నాయి. చిత్తడిగా మారిన ఆయా రోడ్లపై పడ్డ గోతుల్లో వర్షం నీరు చేరడంతో అదుపు తప్పి పడిపోతున్నామని వాహన దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల మరమ్మతు చేపట్టాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్న వించినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ-ఉండవల్లి
మండల పరిధిలోని బైరాపురం గ్రామ ప్రధాన రహ దారి చిన్నపాటి వర్షం వస్తే చాలు చిత్తడి చిత్తడిగా మారి నడవడానికి సైతం ఇబ్బందులు పడుతున్నామని గ్రామ స్తులు వాపోతున్నారు. అలంపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు వెళ్లే ప్రధాన రహదారిపై ఈ గ్రామం మధ్యలోంచి వెళ్తుంది. ఈ రహదారి రెండు కిలో మీటర్ల దూరం అధ్వానంగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నామని వాహనదారులు వాపోతు న్నారు. ఎన్నో ఏండ్లుగా ఈ రోడ్డు దుస్థితి ఇలాగే ఉన్నా ఎవరూ పట్టిం చుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఈ రోడ్డు మీదుగా మూడు గ్రామాల ప్రజలు రాక పోకలు సాగిస్తుంటారు. గ్రామానికి మధ్యలో వాగు ఉండ డం వల్ల భారీ వర్షాలు కురిసినప్పుడు వరదంతా సమీప ఇండ్ల లోకి వచ్చి చేరుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో డ్రైనేజీలు సరిగా లేక పోవడం వల్ల ము రుగు నీరు ఇండ్లలోకి వచ్చి అపరిశుభ్రంగా మారడంతో పాటు పెంట కుప్పలు కూడా గ్రామం మధ్యలో ఉండడం వల్ల దోమలు అధికమై రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పారి శుధ్య పనులు చేపట్టడంలో గ్రామ పంచా యతీ అధికా రులు, పాలకులు పూర్తిగా విఫలమయ్యారని గ్రామ స్తులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబం ధిత అధికారులు. పాలకులు స్పందించి గ్రామ ప్రధాన రహ దారితో పాటు అంతర్గత రోడ్లను బాగు చేయాలని వారు కోరుతున్నారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో..
బైరాపురం రోడ్డు దుస్తుతి గురించి ఆర్అండ్బీ ఏఈ మహేష్‌ని వివరణ కోరగా బీటీ రోడ్డుకు నిధులు మంజూరు కాలేద న్నారు. గ్రామ మధ్యలోఉన్న వాగుపై కల్వర్టు నిర్మాణానికి ఆర్ అండ్ బీ శాఖ నుంచి టెండర్ల ప్రక్రియ పూరైందని కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకోవడంలో నిర్లక్ష్య ధోరణి అవలం భిస్తుండడంతో వంతెన నిర్మాణ పనులు నిలిచి పోయా యని తెలిపారు. మంజూరు అనంతరం పనులు టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారని వారు తెలిపారు.
అధ్వానంగా...
గట్టు: మండలం పరిధిలోని గొర్లఖాన్ దొడ్డి గ్రామంలోని అంబేద్కర్ చౌక్ దగ్గర రోడ్డు అధ్వానంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. ఈ రోడ్డు గుండా మండల కేంద్రం నుంచి ఐజా, మల్లకల్, ఆరగిద్ద తదితర గ్రామాల ప్రజలు రాక పోకలు సాగిస్తుంటారు. ఈ రోడ్డు మీదుగా ప్రయాణం చేయాలంటే నరకం చూస్తున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షం పడితే చాలు ఈ రోడ్డు చిత్తడి చిత్తడిగా మారి నడవ డానికి కూడా ఇబ్బందులు పడతున్నా పట్టించుకునే నాథుడే లేడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామ సర్పంచ్ స్పందించి గుతల మయమైన రోడ్డుపై , అంబేద్కర్ చౌక్ వద్ద కనీసం మొరమైనా వేసి తమ ఇబ్బందులు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.