Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాకాలంలో సాగు చేసే పంటలపై గురువారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయా ధికారులు రైతులకు అవగా హన కల్పించారు. ఈ సందర్భంగా విత్తన ఎంపిక, పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించారు.
నవతెలంగాణ -బాలానగర్
తక్కువ పెట్టుబడి తో ఎక్కువ దిగుబడి పొందే పంటలను సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ తేజోవతి రైతులకు సూచించారు. గురువారం బాలానగర్ మండల పరిధిలోని ఉ డిత్యాల రైతు వేదిక భవనంలో వ్యవసాయ క్లస్టర్ స్థాయి రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు తక్కువ పెట్టుబడి పెట్టి అధిక లాభాలు పొందే పంటలను సాగు చేయాలన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధి కారి వెంకటేష్ మాట్లాడుతూ రైతులు ప్రస్తుత వరి , రాగుల కంటే మొక్కజొన్న, కందులు, పెసరు, కొర్రలు, సామలు, సజ్జలాంటి పంటలను సాగు చేయాలని సూచించారు. జడ్చర్ల హార్టికల్చర్ అధి కారి హిమబిందు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంటల పైన రైతులు ఎక్కువ మక్కువ చూపాల న్నారు. ఈ పంటలకు ప్రభుత్వం 80 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేష్ యాదవ్, ఎంపీటీసీ ప్రమోద్ కుమార్, రైతు కమిటీ సభ్యులు నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
అమరచింత: మండల పరిధిలోని చంద్రగఢ్ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో రైతులకు వానకాలం పంటలపై మండల వ్యవ సాయ అధికారి వినరు కుమార్ అవగాహన కల్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతులు జులై 31 లోగా పీఎం కిసాన్ ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని లేకుంటే పిఎం కిసాన్ డబ్బులు ఖాతాలో జమ కావన్నారు. అదేవిధంగా ఆగస్టులో వచ్చిన పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో జానకి, సర్పంచ్ నాగేశ్వర రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఊట్కూర్: మండల పరిధిలోని ఎడవెల్లి గ్రామంలో రైతులకు జీవన ఎరువు వాడటం ఎ ఈ ఓ కల్పన అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలం పరిధిలో ని అన్ని భూముల్లో ఫాస్పరస్, భాస్వరం సమద్ధిగా ఉందని డిఎపి, భాస్వరం సంబంద కాంప్లెక్స్ ఎరువులను మళ్ళీ మళ్ళీ వాడటం వల్ల భూమి లో గడ్డలుగా పెరుకపోతుందన్నారు. జీవన ఎరువు వాడటం ద్వారా భూమిలోని భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందిస్తుందన్నారు. దీని ద్వారా పంట దిగుబడి 10 నుండి 20 శాతం పెరుగుతుందని సూచించారు.
శ్రీరంగాపూర్ : మండల పరిధిలోని నాగరా ల , గుంపన్పల్లిలో రైతులకు దమ్ము(కరిగేట) చేసి నేరుగా వరి వెదజల్లే పద్ధతిపై మండల వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో అవగా హన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రైతులకు అధిక లాభం చేకూర్చాలంటే నేరు గా వెదజల్లు కోవడం వల్ల రైతులకు ఉపయోగాలు , విత్తన మోతాదు తగ్గడం, నారు పెంచే పని వుండదని, కూలీల సమస్య , ఖర్చు కూడ తగ్గుతుం దన్నారు. నాటు పద్దతి కంటే వారం రోజులు ముం దుగా గానే పంట చేతికి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
వంగూరు: వ్యవసాయంలో మెలుకువలు పాటించడం చాలా అవసరమని జిల్లా వ్యవసా యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామాన్ని ఆయన సందర్శించి రైతులు వేసిన పంటలను పరిశీలిం చారు. అధిక సాంద్రత, ప్రతి పంట, జీలుగు పంట సాగు విధానం, ఎరువుల వాడకంపై రైతులకి సలహాలు సూచనలు చేశారు. వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు రైతులు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీిఏ చంద్రశేఖర్ ఏవో తనుజా రాజు ఏఈ ఓ లు సంతోష్, లలిత రైతులు నరసింహారెడ్డి మరియు పోల్కంపల్లి రైతులు లింగారెడ్డి, రాజిరెడ్డి, పద్మయ, బక్కయ్య, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.