Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభమైన పాఠశాలలు
- నిర్ణయం తీసుకోని పాలకులు
- ప్రశ్నార్థకంగా వాలంటీర్ల భవిత
- ఇతర రంగాలవైపు అడుగులు
- దృష్టి సారించని యంత్రాంగం
- విద్యా వాలంటీర్ల పునర్నియామకంలో స్పష్టత కరువు
ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తూ తక్కువ వేతనం తీసుకుని పని చేసే విద్యా వాలంటీర్ల పరిస్థితి ప్రభుత్వ తీరుతో అయోమయంగా మారింది. కరోనా నాటి నుంచి విధుల నుంచి తొలగింపునకు గురైన వారు ఇతర రంగాలకు చెందిన పనులు చేసు కుంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. అందులో కొందరు వ్యవసాయం, ఉపాధి పనులు, చేతి వృత్తులు, మరి కొందరు భవన నిర్మా ణ రంగ, ప్రయివేట్ కంపెనీలలో పని చేస్తున్నారు. చాలా మందికి పనిచేసిన కాలంలో వేతనాలు కూడా ఇవ్వకపోవడంతో వాలం టీర్ల బతుకులు దర్భరంగా మారాయి. పాఠశాలలు ప్రారంభమైనా నేటికీ విద్యా వాలంటీర్లను తీసుకునే విషయంలో పాలకులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో వాలంటీర్లు తమను తీసుకుంటారా ? లేదా ? అనే సందిగ్ధంలో పడ్డారు. అయితే వీరిని విధుల్లోకి తీసుకుని ఉపాధి కల్పించాలని పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.
నవతెలంగాణ - మహబూబ్నగర్
మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 3,135 ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లున్నాయి. అందులో 50 శాతం పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ప్రతి 35మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నప్ప టికీ స్థానికంగా ఉండి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారిని విద్యా వాలంటీర్లు గా ప్రభుత్వం తీసుకుంది. వీరికి నెలకు రూ.12వేలు వేత నం ఇచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా పని చేయించింది. అందులో జిల్లా వ్యాప్తంగా 91మంది విద్యా వాలంటీర్లున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు పట్టణ కేంద్రా లు, జిల్లా కేంద్రాల నుంచి వస్తుంటారు. వీరంతా సుదూర ప్రాంతాల నుంచి గ్రామాలకు ఆలస్యంగా వెళ్తుంటారు. ఈ క్రమంలో విద్యా వాలంటీర్లు అక్కడ ప్రార్థన మొదలుకుని ప్రభుత్వ ఉపాధ్యాయులు వచ్చేంత వరకు పాఠశాల నిర్వహ ణ బాధ్యతను నిర్వర్తిస్తారు. తర్వాత వారితో పాటుగా పాఠా లు బోధిస్తారు. వీరికి ప్రతి నెలా వేతనాలు సక్రమంగా ఇవ్వరు. అయినా వీరు పని చేస్తూనే ఉంటారు. కరోనా ఉధృతి నేపథ్యంలో పాఠశాలలు మూత పడడంతో వాలం టీర్లు ఇండ్లకే పరిమితమ య్యారు. వీరి ఉద్యోగానికి ఎలాం టి భద్రత లేకపోవడంతో నెలనెలా వేతనాలు ఇవ్వలేదు. చెల్లిస్తారనే నమ్మకమూ లేదు. దీంతో చేసేది లేక చాలా మంది వ్యవసాయ, ఉపాధి పనులతో పాటు వివిధ రంగా లకు చెందిన పనులను చేసుకుంటూ కుటుంబాలను నెట్టు కొస్తున్నారు. ప్రస్తుతం విద్యా వాలంటీర్లను తీసుకోకు ండా ఉన్న ఉపాధ్యాయులతో సర్దుబాటు చేసి పాఠశాలలను కొన సాగిస్తారనే వార్తలు విన్పిస్తున్నాయి. అయితే పిల్లలకు అక్షరజ్ఞానం బోధించే విషయంలో విద్యా వాలంటీర్ల్ల పాత్ర కీలకమనే చెప్పాలి.
విద్యారంగంపై నిర్లక్ష్యం ?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంపై నిర్లక్ష్యం వహిస్తున్నాయనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో మూ డేండ్లుగా ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. వందల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉ న్నా వాటిని భర్తీ చేయడంలో తాత్సారం చేస్తున్నారు. పాల మూరుతో పాటు అక్షరాస్యత పరంగా దేశంలో నే వెనుకంజలో ఉన్న గద్వాల జిల్లాలోని గట్టు, కేటీ దొడ్డి మండలాలతో పాటు నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని అనేక ప్రాంతాలు విద్యా పరంగా వెనుకంజలో ఉన్నాయి. ప్రభుత్వం పాఠశాలలను బ లోపేతం చేస్తున్నామంటూ జిల్లాలో మన ఊరు- మ న బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వస తుల కల్పను శ్రీకారం చుట్టింది. అందులో ఉపాధ్యా యుల ఖాళీలు చేపట్టకుండా ఈ కార్యక్రమం చేపట్ట డంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. కేవలం పాఠశాలలకు మరమ్మతులు, మౌలిక వసతులు కల్పి స్తే విద్యారంగం అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నిస్తు న్నారు. అందువల్ల పాలకులు వెంటనే ఖాళీలు భర్తీ చేయాలని, లేకుంటే విద్యా వాలంటీర్లను నియమిం చాలని ఆయా ప్రజా సంఘాల నాయకులు కోరు తున్నారు.