Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పెబ్బేరు
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో దోమల నివారణ మందు పిచికారి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ ఎద్దుల కరుణ శ్రీ సాయి తెలిపారు. గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పెబ్బేరు మున్సిపల్ పరిధి లోని కస్తూర్బా విద్యాలయంలో దోమల నివారణ మందు పిచికారి చేశారు . ఈ సందర్భంగా స్థానిక వైద్య అధికారి డాక్టర్ సాయి శ్రీ , మున్సిపల్ కమిషనర్ జాన్ కపాకర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష , జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి అదేశం మేరకు మునిసిపల్ పరిధిలోని కస్తూరి బా విద్యాలయం, మహాత్మా జ్యోతి రావు పులే విద్యాలయం, తెలంగాణ మోడల్ స్కూల్, బీసీ హాస్టల్లో దోమల నివారణ మందు పిచికారి చేశామన్నారు. అనంతరం విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన కల్పిం చారు. ఈ కార్యక్రమము లో హెల్త్ సూపర్ వైజర్ వెంకట్ సుబ్బమ్మ, సూర్య నారాయణ, హెల్త్ అసిస్టెంట్ లు రాజశేఖర్, లక్ష్మి రెడ్డి, గంధము రాజు, సురేష్ గౌడ్, లక్ష్మణ మరియు స్కూల్ ప్రిన్సిపల్ పద్మ, మౌనిక, ఆశ కార్యకర్త నాగ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.