Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరచింత: బీడీ కార్మికులందరికీ జీవన భృతికింద పెన్షన్ ఇవ్వాలని సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం మున్సి పల్ మేనేజర్ ఎల్లారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏ.బుచ్చన్న, ఆర్యన్ రమేష్ మాట్లాడుతూ అమరచింత మున్సిపాలిటీలోని బీడీ కార్మికులకు పీఎఫ్ తో సంబంధం లేకుండా జీవన భతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇండ్లు ఇచ్చేదని మోదీ ప్రభుత్వం వచ్చాక హౌసింగ్ ఇండ్లు రద్దు చేసిందన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో బీడీ కార్మికులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పట్టి వరకు ఒక ఇళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి అర్హులైన బీడీ కార్మికులు అందరికీ జీవనభతి తోపాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు తిరుపతి, తిరుమలేశ్, రాము తదితరులు పాల్గొన్నారు.