Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గట్టు
ప్రమాదవశాత్తు రైతులు మృతి చెందితే రైతు కుటుం బాన్ని ఆర్థికంగా ఆదుకునేం దుకు రూ.5 లక్షలు అంద జేసే విధంగా ప్రభుత్వం ప్రవే శపెట్టిన రైతుబీమాకు రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఎం పీపీ విజరుకు మార్ తెలి పారు. స్థానిక ఎంపీడీఓ కా ర్యాలయంలోని ఎంపీపీ హా లులో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లా డారు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హుల న్నారు. ఇప్పటి వరకు రైతుబీమా చేసుకోని వారు దరఖాస్తు చేసుకోవాల న్నారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సున్న రైతులు అర్హులున్నారు. అలాగే ఆధార్ కార్డులో నామినీ వివరాలల్లో ఏదైనా మార్పులు చేర్పులుంటే ఏఈఓలను సంప్రదించి సరిచేసుకో వాలన్నారు. ఈ నెల చివరిలోపు దరఖా స్తు చేసుకో వాలని సూచించారు.