Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ
నవతెలంగాణ -వంగూరు
ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఉన్నత వర్గాల వారికి జాబ్‌కార్డులు ఇచ్చారని డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ జాబ్ కార్డ్ అనేది పేద వర్గాలకు చెందిన కూలీలకే మాత్రమే మంజూరు చేయాలి కాని ఉన్నత వర్గాలకు చెందిన వారికి జాబ్ కార్డు ఎలా ఇస్తారని అధికారులను ప్రశ్నించారు. మా నాయకులకు పనులు చేసి పెట్టాలని ఎమ్మెల్యే మండల అధికారులను ఒత్తిడికి , భయబ్రాం తులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలపై స్పందించకుండా అధికారులను తిట్టడం, కొట్టడం, భయభ్రాంతులకు గురి చేయటం అప్రజాస్వామికమన్నారు. ఇసుక మాఫియా, గుంతలు తీయటం అయి పోయింది ఇక ఉపాధి హామీ పథకం మీద పడ్డారని అన్నారు. పేదలకు ,రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉద్యమిస్తామన్నారు. మండల అధికారులు తప్పిదాలకు తావివ్వకుండా నిజాయితీతో పనిచేయాలని కోరారు. ఎప్పుడు ఒకే ప్రభుత్వం ఉండదన్నారు. తప్పిదాలకు పాల్పడుతున్న వంగూరు మండల అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు పండిత్రావు, ఎంపీటీసీ రమేష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఖయ్యూం, జనార్ధన్, రఫీ, జంగయ్య , దశరథం, చంద్రయ్య, ఘఫూర్, శివ తదితరులు పాల్గొన్నారు.