Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వంగూరు
విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంద ని, అందులో భాగంగానే మన ఊరు-మన బడి కార్య క్రమంలో భాగంగా పాఠశాలలను మరింత సుందరంగా తీర్చిదిద్దుతుందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నా రు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మం డలంలోని దిండి చింతపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠ శాలలో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టిన ప్రహరీ నిర్మా ణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేసి పను లు ప్రారంభించి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. బడుగు, బలహీన నిరుపేద విద్యార్థులు విద్యా పరంగా రాణించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చు ట్టారన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక రకరకాల ఆరోపణలు చేయడం తగదన్నారు. విమర్శలు మాని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హితవు పలి కారు.
కార్యక్రమంలో సర్పంచ్ బత్తిని సరిత, ఎంపీ టీసీ సాయిలు, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు కృష్ణా రడ్డి, సింగిల్విండో చైర్మన్ సురేందర్ రెడ్డి, నాయకులు గణేష్ రావు, మంద రాజేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, లాల్ యాదవ్, సురేందర్, దేవా, మల్లేష్, రాజు పాల్గొన్నారు.