Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల వ్యవసాయాధికారి వినరుకుమార్
పంటల సాగులో మెళకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని, అందువల్ల రైతులు వ్యవసాయాధికారుల సూచనల మేరకు పంటలు సాగు చేసుకోవాలని, ఎలాంటి సందేహాలున్నా ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలని, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిం చి సేంద్రీయ ఎరువులను వినియోగించాలని, అప్పుడే పంటలు కలుషితం కాకుండా ఉంటాయని మండల వ్యవసాయాధికారి వినరుకుమార్ అన్నారు. శుక్రవారం 'నవతెలంగాణ'తో పంటల సాగు తదితర విషయాలను పంచుకున్నారు.
నవతెలంగాణ - ఆత్మకూరు
నవతెలంగాణ : మండలంలో సాగు విస్తీర్ణం ఎంత ?
వ్యవసాయాధికారి : మందలంలో 23 వేల ఎకరాలు సాగౌతోంది.
నవతెలంగాణ : వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయా ?
వ్యవసాయాధికారి : వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అ యితే వీటిని సహకార సంఘం ద్వారా సబ్సిడీపై అందజేస్తున్నా ం. అందులో ఆర్ఎన్ఆర్ 25 కేజీలకు రూ.850లు చెల్లించాల్సి ఉంది.
నవతెలంగాణ : మెట్ట నేలలో ఏఏ పంటలు సాగు చేయాలి ?
వ్యవసాయాధికారి : మెట్ట నేలల్లో కందులు, పత్తి, ఆముదం వం టివి సాగు చేయాలి.
నవతెలంగాణ : వరి నారు మంచిగా రావాలంటే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
వ్యవసాయాధికారి : రైతులు కట్టకముందు విత్తనాలు శుద్ధి చేయా లి. కానీ చాలామంది రైతులు శుద్ధి చేయడంలేదు. ఒక కిలో విత్త నానికి ఒక గ్రాము కార్బోనిజంతో విత్తనశుద్ది చేయాలి.
నవతెలంగాణ : సబ్సిడీపై పరికరాలు, పనిముట్లు ఇస్తున్నారా ?
వ్యవసాయాధికారి : ప్రస్తుతం అలాంటివి ఇవ్వడంలేదు.
నవతెలంగాణ : రైతు వేదికలు రైతులకు ఏవిధంగా ఉపయోగప డుతున్నాయి ?
వ్యవసాయాధికారి : రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రైతువేదికలు రైతు లకు చాలా ఉపయోగపడుతున్నాయి. రైతులందరు ఒక చోట చేరి సమావేశమై పలు అంశాలు చర్చించుకునేందుకు దోహదపడుతు న్నాయి. వారానికి రెండు సార్లు తాము అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మండలంలో ముగ్గురు ఏఈఓలున్నారు. అం దులో ఆత్మకూరు సెక్టారుకు మహేశ్వరి, ఆరేపల్లికి సంధూజ, జూ రాలకు శివకుమార్లున్నారు. వ్యవసాయ సంబంధమైన సమస్య లుంటే వీరిని సంప్రదించాలి. వారి ద్వారా ఇతర సేవలు కూడా అందజేసి ఇబ్బందుల్లేకుండా చూస్తాం.
నవతెలంగాణ : నకిలీ విత్తనాల నివారణకు ఎలాంటి
చర్యలు చేపట్టారు ?
వ్యవసాయాధికారి : నకిలీ విత్తనాల నివారణపై ప్రత్యేక దృష్టి సారి స్తున్నాము. విత్తనాలమ్మే దుకాణాల నుంచి నమూనాలు సేకరించి పరిశీలిస్తున్నాం. రైతులెవరైనా ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా చర్య లు తీసుకుంటాం.