Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మరికల్
దాబాల్లో అనుమతి లేకుండా మద్యం సిట్టిం గ్ నిర్వహిస్తే చర్యలు తప్పవని సీఐ రాంలాల్ అన్నారు.. స్థానిక పోలీసు స్టేషన్లో ఎస్ఐ అశోక్బాబుతో కలిసి శుక్రవారం దాబా నిర్వాహకులతో మాట్లాడారు. మద్యం సేవించడం వల్ల చోటు చేసుకునే రోడ్డు ప్రమాదాల గురి ంచి వివరించారు. అందువల్ల ప్రమాదాల నివారణకు స మిష్టిగా కృషి చేయాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్ల ంఘిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. జాతీయ రహ దారి వెంట ప్రతి రోజు తనిఖీలు నిర్వహిస్తామని తెలియ జేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసు లు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.