Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష
- విదేశీ విద్యకు రూ.20 కోట్లు : ఎమ్మెల్యే ఆల
నవతెలంగాణ - కొత్తకోట
ప్రణాళికతో విద్యనభ్యసిస్తే బంగారు భవిత సాధ్యమౌతుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ లక్ష్యాలు నిర్దే శించుకుని చదవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష విద్యార్థినులకు సూచించారు. మండల కేంద్రంలోని ఎస్సీ రెసిడెన్సియల్ పాఠశాలలో నూతనంగా నిర్మించిన జూని యర్ కళాశాలను దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ంలో నిరుపేద విద్యార్థులను దష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో కళాశాలలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని వసతులు కల్పిస్తామని, ఎవరు కూడా ఒత్తిడికి గురి కావద్ద న్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ విదే శీ విద్య కోసం ప్రభుత్వం రూ.20 లక్షలు అందజేస్తుంద న్నారు. నియోజకవర్గంలో 6 గురుకులలున్నాయని, వా టికి 5 ఎకరాలు సిద్ధం చేశామని, భవన నిర్మాణాల కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. అంతకుముందు మండల ంలోని పామాపురం, కొత్తకోట, కనిమెట్ట గ్రామాలకు చెం దిన లబ్దిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లు, సుంకిరెడ్డిపల్లికి చెందిన బాలపీర్కు మంజూరైన రూ.4 లక్షల ఎల్ఓసీ పత్రాన్ని అందజేశారు. అలాగే కని మెట్ట గ్రామంలో మత్స్యకారుల భవనానికి స్థలం దానం చేసిన దాత కిరణ్‌కు శాలువా వేసి ఘనంగా సత్కరించా రు. అనంతరం దళితబంధులో భాగంగా లబ్ధిదారులకు మంజూరైన ట్రాక్టర్లను కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే అందజే శారు. కార్యక్రమంలో రీజినల్ కో- ఆర్డినేటర్ వనజ, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికా ర్జున్, తహసీల్దార్ బాల్ రెడ్డి, ఎంపీపీ గుంత మౌనిక, వైస్ ఎంపీపీ వడ్డె శ్రీనివాసులు, మున్సిపల్ చైర్పర్సన్ సుఖేషి ని విశ్వేశ్వర్, డీసీసీబీ డైరెక్టర్ వంశిధర్ రెడ్డి, సీడీసీ చైర్మన్ చెన్నకేశవ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గాడిల ప్రశాంత్, పామాపురం సింగిల్ విండో చైర్మన్ వాసుదేవ రెడ్డి, కౌన్సి లర్లు పాల్గొన్నారు.