Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంతులమ్మగా..కళాకారిణిగా రాణిస్తోన్న 'పద్మాలయ ఆచార్య'
- హరికథకు పూర్వ వైభవం తెచ్చేందుకు యత్నం
- కలకు జీవితం అంకితం
- తండ్రి కళను నెరవేర్చిన తనయ
- వేల ప్రదర్శనలతో కీర్తి ప్రతిష్టలు
- అంతరిస్తున్న కళకు జీవం పోస్తూ..విమర్శకుల నోళ్లు
మూయించి..కలను బతికించేందుకు ఆమె తన జీవితాన్ని అంకితం చేసింది. 1880-83లో ఆర్యభట్ట నారాయణ దాసు గజ్జకట్టి ప్రదర్శించిన హరికథ నేడు ఆదరణకు నోచుకోవడం లేదు. దీంతో ఆ కళకు ఆకర్షి తురాలైన ఓ సాధారణ మహిళ తన తండ్రి వద్ద శిష్యరికం చేసి మరీ కళను బతికించేందుకు పడిన కష్టాలు అంతా ఇంతా కాదు. వేల ప్రదర్శనలతో కీర్తి ప్రతిష్టలు గడించి తండ్రి ఆశయాన్ని బతికింది ఓ ఉపాధ్యాయురాలు పద్మాలయ ఆచార్య. ఈమె ఓ వైపు ఉపాధ్యా యురాలిగా విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దుతూ, మరోవైపు కళాకారిణిగా తన ప్రదర్శనలతో సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనతోనే ఈ కళ అంతరించకూడదనే ఉద్దేశంతో అనే క మంది పిల్లలకు ఈ కళపై శిక్షణ ఇస్తోంది. కళను బతికించుకు నేందుకోసం ఆమె పడుతున్న తపన, వీటికి పూర్వ వైభవం తెచ్చేందుకు చేస్తున్న కృషి తదితర విషయాలపై 'నవతెలంగాణ' అంది స్తోన్న ప్రత్యేక కథనం మీకోసం.
నవతెలంగాణ - కందనూలు
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన నరసింహ ఆచార్య జయలక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. అందులో పెద్ద కుమార్తె పద్మాలయ ఆచారి ఎంఏ.బీఈడీ చేసి తాడూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయు రాలిగా పని చేస్తున్నారు. కుమారుడు పురోహితం చేయగా చిన్న కుమార్తె కర్నూలులో సింగర్‌గా స్థిరపడింది. అందు లో పెద్ద కుమార్తె 1965లో జన్మించింది. ఈమె తన చిన్న తనం నుంచే తండ్రి హరికథలు చెప్పడంతో వాటిపై ఎక్కు వ మక్కువ చూపేది. తన 15వ ఏట నుంచే హరికథను ఆకలింపు చేసుకుని ప్రదర్శనలు ప్రారంభించింది. ఈ కళ ను ప్రదర్శించే వారు అతి తక్కువ మంది ఉండడం, తండ్రి తో ఈ కళ అంతరించపోకూడదని, తనతో ఈ కళకు పూర్వ వైభవం తీసుకురావాలని బలంగా నిర్ణయించుకుంది. అను కున్నట్లు గానే తండ్రి వద్ద శిష్యరికం చేసి కళపై పట్టు పెం చుకుంది. ఒక వైపు చదువుకుంటూ మరోవైపు ప్రదర్శనలి స్తూ వచ్చేది. కాల క్రమేనా ఆమె తెలుగు ఉపాధ్యాయురా లిగా కొలువులో చేరింది. వృత్తిపరంగా ఉపాధ్యాయురాలి గా విద్యార్థులను తీర్చి దిద్దుతూ ప్రవృత్తి అయిన హరి కథ కు జీవం పోసేలా భక్తి గీతాలు, పరిశోధనలు, వివిధ రచ నలు, సాంస్కృతిక సేవా కార్యక్రమాలతో అందరినీ ఆకట్టు కునేది.
మహిళ కావడంతో బహిరంగ ప్రదర్శనల నేప థ్యంలో ఎన్నో విమర్శలు, అవమానాలు ఎదుర్కొంది. వీట న్నిటికీ సమాధానమిస్తూ..ఇప్పటి వరకు ఆమె 6 వేల పుర స్కారాలు అందుకుని ప్రదర్శనలతో అనేక మంది విమర్శ కుల నోళ్లు మూ యించింది.
ప్రశంసలు అవార్డులు
- రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది విశిష్ట పురస్కారం
- దుబాయ్ వేవ్ రిసోనాన్సు నుంచి ఇంటర్నేషనల్ ఎస్సెలెన్సు అవార్డు
- మలేషియా తెలుగు సంఘం నుంచి మహిళా శిరోమణి అవార్డు
- రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభివద్ధి శిశుసంక్షేమ
శాఖ నుంచి విశిష్ట మహిళా పురస్కారం
- వరంగల్ సుధా సేవా సమితి నుంచి జాతీయస్థాయి కళారత్న అవార్డు
- లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వారిచే మహిళా శిరోమణి అవార్డు
- టీఎస్ఆర్ కాకతీయ లలిత కళాపరిషత్ టి.సుబ్బరామిరెడ్డి
చేతుల మీదుగా ఉత్తమ హరికథ కళాకారిణి అవార్డు
- కళానిలయం హైదరాబాద్ వారిచే విశిష్ట పురస్కారం
సీనారె స్వర నీరాజనం పురస్కారం
- కందుకూరి వీరేశలింగం అవార్డు
- ప్రపంచ తెలుగు మహాసభలో ఉత్తమ హరికథ కళాకారిని అవార్డు.
- మంత్రాలయ పీఠం నుంచి హరికథ విషరజా అవార్డు
- అలంపూర్ జోగుళాంబ పురస్కారం
- కల్వకుర్తి స్వర్ణ భారతి కల్చరల్ అకాడమీ వారిచే ఉత్తమ కళాకారిణి అవార్డు
- టీఆర్ఎస్ఎంఏ మహబూబ్‌నగర్ వారిచే ప్రజ్ఞా పురస్కారం
- వీరగంధం హరికథ పీఠం వారిచే పురస్కారం
హరికథకు పూర్వ వైభవం రావాలి
యాంత్రిక జీవన విధానంలో కళను బతికించుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి. హరికథల సమాహారంలో మూస ధోరణి వీడాలి. అంత రిస్తున్న హరికథకు పూర్వ వైభవం తేవాలంటే ప్రభుత్వం సహకరించాలి. కాలాని కనుగు ణంగా సామాజిక అంశాలను జోడిస్తూ కళా నైపుణ్యంతో కూడిన ప్రదర్శనలు చేయాలి. ఆడ పిల్లలు, మహిళలను చైతన్య పరిచే విధంగా భ్రూణహత్యలు, బాల్య వివాహాలు, ప్రేమ వివాహాలు, వరకట్నపు వేధింపులు వంటి వాటిపై సామాజిక స్పహ కలిగిన ప్రదర్శనలు చేయడం తో సామాజిక చైతన్యం సాధ్యమౌ తుంది. కొత్త జిల్లాలో కళాకారుల కోసం ఆడిటోరియం, బాల భవన్ ఏర్పాటు చేయాలి. అంతరిస్తున్న కలలను కళా కారులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి. భవిష్యత్‌లో హరికథ పాఠశాల పెట్టాలనుకున్నాను.
- పద్మాలయ ఆచార్య, కళాకారిణి