Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మక్తల్
ప్రతి ఒక్కరూ సారా, గంజాయి, గుట్కాలు వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మక్తల్ సీఐ సీతయ్య అన్నారు. మండలంలోని జోలా పూర్ గ్రామంలో శుక్రవారం ఆయన సామాజిక అంశాలపై ప్రజలకు అవ గాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థా ల వల్ల అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలౌతారన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాల నియంత్రణ సులభతరమౌ తుందన్నారు. అందువల్ల మండలంలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్ఐ పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.