Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్
- హరితహారంపై ఎంపీడీఓలు, పంచాయతి కార్యదర్శులతో సమీక్ష
నవతెలంగాణ - ధరూర్
జిల్లాలో చేపట్టిన 8వ విడత హరితహారంలో నిర్దేశించిన లక్ష్యాలను మించి మొక్కలు నాటి వాటిని సంర క్షించాలని ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అధికా రులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాల య సమావేశ భవనంలో హరితహారంపై ఎంపీడీఓలతో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంచాయతి కార్యదర్శులతో స మీక్షించి మాట్లాడారు. హరితహారాన్ని విజయవంతం చేయాలని, జిల్లాకిచ్చిన 13 లక్షల టార్గెట్ కంటే ఎక్కువగా మొక్కలు నాటి జిల్లాను సస్యశ్యామలం చేయాలన్నారు. గ్రా మాలలో పంచాయతి కార్యదర్ళులు అనుకుంటే జిల్లాను నెంబర్ వన్‌గా మార్చగలరన్నారు. హరితాహారం, శానిటేష న్, పల్లెప్రకతి, బహత్ పల్లె ప్రకతి వనం, వైకుంఠ ధామాల ను ప్రతి రోజు పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో రోడ్ల వెంట, ఆయా శాఖల ఆవరణ ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నా టాలన్నారు. మండలంలో ఎక్కడెక్కడా మొక్కలు నాటారనే విషయాలు ఎంపీడీఓ, గ్రామ కార్యదర్శులకు తెలుసుకుని ఉండాలన్నారు. అందులో భాగంగా ధరూర్, మానవపాడు పంచాయతి కార్యదర్శులతో హరితహారం ఎలా సాగుతుం దని, అవెన్యూ ప్లాంటేషన్ సక్రమంగా నిర్వహిస్తున్నారా ? లేదా అడిగి తెలుసుకున్నారు. అయితే మానవపాడు మం డలంలోని జాతీయ రహదారికిరువైపులా మొక్కలు నాటా లన్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలని సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీహ ర్ష, అటవీ శాఖ కన్జర్వేటర్ క్షితిజ, డీపీఓ శ్యాంసుందర్, డీఆ ర్డీఏ ఇంచార్జి నాగేంద్రం, ఆయా శాఖల జిల్లా అధికారు లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.