Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అచ్చంపేట : విద్యార్థులు, ఉద్యమ కారులు, తొలి, మలి దశలో ఎందరో ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు దొరల గడి లో బందీగా ఉందని వైఎస్ఆర్టీపీ అచ్చంపేట నియోజకవర్గ ఇంచార్జి సిరి రమేష్ అన్నారు. శుక్రవారం అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో పోడు భూముల భూ నిర్వాసితులకు దుప్పట్లు, చీరలు పంపిణి చేసి మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోడు భూములు సాగు చేసుకున్న గిరిజనులకు పట్టాలిచ్చారని గుర్తు చేశారు. పోడు భూములపై రుణమాఫీ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పట్టాలిచ్చే వరకు తాము పోరాటం చేస్తామన్నారు. వైఎస్ షర్మిల పార్టీ అధికా రంలోకొస్తే పోడు భూములకు పట్టాలపైనే తొలి సంతకం పెడతారని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కొండురు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.