Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిడ్డకు లోకం చూపించేందుకు తల్లి నరకం
- సిబ్బందిలేక మూలనపడ్డ పరికరాలు
- ప్రయివేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న వైనం
- దృష్టి సారించని అధికారులు
- దిక్కుతోచనిస్థితిలో గర్భిణులు
'' ఈ ఏడాది జనవరి 26న బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన లాలమ్మ అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడి సిబ్బంది ఆమెకు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ రావడంతో ప్రసవం చేసేందుకు నిరాకరించారు. దీంతో ఆమె 3 గంటల పాటు పురిటి నొప్పులు భరించి ఆరుబయట ఆస్పత్రి గేటు బయట ప్రసవించింది. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో గర్భిణి పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ''
'' ఫిబ్రవరి11న లింగాల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన స్వప్న, ఏప్రిల్ 29న బొమ్మనపల్లి గ్రామానికి చెందిన ముత్యాలమ్మ అనే చెంచు మహిళ 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రసవించారు. వీరిని మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ''
సృష్టికి మూలమైన మాతృమూర్తి పాలకుల తీరు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేదన చెందుతోంది. బిడ్డకు లోకాన్ని చూపించేందు కు తల్లి నరకం అనుభవిస్తోంది. నల్లమలలో నివాసం ఉండే ఆదివాసులతో పాటు సాధారణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేం దుకు ఏర్పాటు చేసిన ఆస్పత్రులు లక్ష్యాలకనుగుణంగా పని చేయడంలేదు. అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉంచినా వాటికి సంబంధించిన సిబ్బంది లేకపోవడంతో గర్భిణులు ప్రయివేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. పురుటి నొప్పులు భరించి బిడ్డకు జన్మనిచ్చే మహిళ అధికారులు చూపే నరకాన్ని చూడలేకపో తోంది. అన్ని అవాంతరాలు దాటుకుని ఆస్పత్రికొ చ్చామన్న సంతోషాన్ని పాలకులు, అధికారులు ఆవిరి చేస్తున్నారు. దీంతో కలత చెందిన హృదయంతో ప్రయివేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. అందువల్ల అధికారు లు స్కానింగ్ సేవలు అమలులోకి తీసుకురావాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.
నవతెలంగాణ - అచ్చంపేట
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒక జిల్లా ఆస్పత్రి, 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 కమ్యూనిటీ ఆస్పత్రులు, 178 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రా లు, 11 అంబులెన్స్ లున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 58 శాతం ప్రసవాల శాతం ఉంటే ప్రయి వేట్ ఆస్పత్రుల్లో 42 శాతం ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతు న్నాయి. కానీ వాస్తవానికి ప్రయివేట్ ఆస్పత్రుల్లోనే ప్రస వాలు ఎక్కువ శాతం చేస్తున్నట్లు సమాచారం. బల్మూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 697 మంది గర్భిణులు, 780 మంది బాలింతలున్నారు. అచ్చంపేట ప్రాజెక్టు పరిధిలో 890 మంది గర్భిణులు, 842 మంది బాలింతలున్నారు. అందులో 8 నెలలు పూర్తైన వారు, 6 నెలలు, 4 నెలలు పూ ర్తై వారున్నారు. వీరంతా కడు పులో బిడ్డ ఎలా ఉంది, ఎదు గుదల, ఆరోగ్యం వంటి వాటిని తెలుసుకునేందుకు తప్పని సరిగా ఆస్పత్రుల్లో స్కానింగ్ చేయాల్సి ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా రేడియాలజిస్టులు లేకపో వడంతో ప్రయివేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అం దుకోసం నిర్వాహకులు రూ.500ల నుంచి రూ.1000ల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. మందుల పేరుతో మరో రూ.1500లు తీసుకుంటున్నారు. వీరికి కనీసం ఆరోగ్య విషయాలు, సలహాలు, సూచనలు ఇచ్చే వారు లేరు. గ్రా మాల్లో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు తెలిసిన మేరకు సల హాలిస్తున్నారు. చాలా కాలంగా ఆస్పత్రుల్లో గర్భిణులకు అ ంతంత మాత్రంగా వైద్య సేవలందు తున్నట్లు సమాచా రం. ఇక ఏజెన్సీ వాసుల పరిస్థితులు మరీ దయనీయం. రవాణ వ్యవస్థ సరిగా లేకపోవడం, ఉన్నా గుంతలమయ మైన రహదారులను దాటుకుని ఆస్పత్రులకు వచ్చేందుకు నరకం అనుభవిస్తున్నారు. అన్ని దాటుకుని వస్తున్న తరు ణంలో మార్గమ ధ్యలోనే ప్రసవాలు కావడం వంటివి పరిపాటిగా మారింది. ప్రసవం అయ్యేం త వరకు కనీసం మూడు సార్లైనా స్కానింగ్ చేయాల్సి ఉంది. దీంతో ప్రతి సారి గర్భిణులు అవస్థల మధ్య పరీక్షలు చేయించుకుం టున్నారు. అందువల్ల అధికారులు స్పందించి రేడియాలజి స్టులను నియమించి గర్భిణుల అవస్థలు తీర్చాలని కోరు తున్నారు.
స్కానింగ్ సేవలు అమలు చేయడం లేదు
ఆస్పత్రిలో గర్భిణులకు స్కానింగ్ సేవలు అమలు చేయడం లేదు. రేడియాలజిస్టులు లేకపోవడం వల్ల సేవలు నిలిపివేశాం. ప్రభుత్వం పోస్టులను భర్తీ చేయా ల్సి ఉంది. స్కానింగ్ లేకపోవడంతో చాలా మంది ప్రయి వేట్ ఆస్పత్రుల్లో చేయించుకుంటున్నారు.
- డాక్టర్ ప్రభు,
ఆస్పత్రి సూపరింటెండెంట్, అచ్చంపేట