Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్ ఫ్లో 34,110 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో 47,574 క్యూసెక్కులు
- పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు
- ప్రస్తుతం 4.110 టీఎంసీలు
నవతెలంగాణ - ధరూర్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వరప్రదాయిని అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో ఎగువ నుంచి వస్తున్న నీటిని నిల్వ చేసుకు నేందుకు అధికారులు గేట్లను మూసేశారు. ఎగువన నారా యణపూర్ నుంచి 60 వేల క్యూసెక్కులు, ఆల్మట్టి నుంచి 63 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో జూరా లకు 34,110 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీ ఎంసీలు కాగా ప్రస్తుతం 4.110 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 42,865 క్యూసెక్కుల నీటిని ఉపయోగించి 6 యూనిట్లలో 234 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. యథావిధిగా జూరాల నుంచి నెట్టెంపాడుకు 1500 క్యూసెక్కులు, భీమా -1కు 1300, భీమా-2కు 750 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 920 క్యూసెక్కులు, కుడి కాల్వకు 422 క్యూసెక్కు లు, కోయిల్‌సాగర్‌కు-0 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మొత్తంమీద దిగువ ప్రాంతానికి 47,574 క్యూసెక్కుల నీటిని వదిలి నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.