Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూనియర్ లైన్మెన్ పరిక్ష పత్రం లీక్ !?
- ఆందోళనలో అభ్యర్థులు
- రూ.10లక్షలకో ఉద్యోగం ?
విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీ కోసం ఈ నెల 17న ప్రభుత్వం నిర్వహించిన జూనియర్ లైన్మెన్ పోస్టుల కు సంబంధించి పరీక్ష నిర్వ హించింది. ఈ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో పరీక్ష రాసిన నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చెందు తున్నారు. కోచింగ్లు తీసుకుని మరీ పరీక్షలు రాసి కొలువు కోసం ఎదురు చూసే వారందరి ఆశలపై ప్ర భుత్వం నీళ్లు చల్లినట్లైంది. అంతేకా కుండా రూ.10 లక్షలకు ఒక పోస్టు చొప్పున అమ్మకాలు చేపట్టినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. అందువల్ల అధికారులు స్పందించి పరీక్ష మళ్లీ నిర్వహించి అభ్యర్థులకు న్యా యం చేయాలని నిరుద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.
నవతెలంగాణ - కల్వకుర్తి
ఉమ్మడి మహబూ బ్ నగర్ జిల్లాలో దాదాపు 100 జూనియర్ లైన్మెన్ పోస్టులకు గాను దాదాపు లక్ష మంది అభ్య ర్థులు దరఖాస్తు చేసుకుని ఈ నెల 17న పరీక్ష రాశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 30 పోస్టులకు దా దాపు 20 నుంచి 30 వేల మంది అభ్య ర్థులు పరీక్ష రాశారు. అయితే పేపర్ లీక్ కావ డంతో ఉద్యోగాలపై ఎన్నో ఆశలు పెట్టుకుని పరీక్షలు రా సిన విద్యార్థులకు తీవ్ర నిరాశ ఎదురైంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో 1000 జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు గానూ దాదా 12 లక్షల మంది అభ్యర్థు లు దరఖాస్తు చేసుకున్నారు. కొంత మంది అభ్యర్థులు రెండు నెలల పాటు కోచింగ్ తీసుకున్నారు. ఈ శిక్షణ కోసం ఒక్కొక్కరు రూ.50 వేల వరకు ఖర్చు చేశారు. ఈ నెల 17న హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో జూని యర్ లైన్మెన్ పరీక్షలు నిర్వహించారు. ఘట్కేసర్తో పాటు సుల్తాన్ బజార్ పరిధిలో నిర్వహించిన పరీక్ష కేం ద్రాల్లో కొంతమంది అభ్యర్థులు సెల్ఫోన్లు తీసుకెళ్లి పేపర్ లీక్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసి పేపర్ లీక్ చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తూన్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో అభ్యర్థులు ఆందో ళన చెందుతున్నారు. అయితే ఒక్కో పోస్టును రూ.10 లక్షలకు విక్రయించినట్టు ఆరోపణలున్నాయి. అందువల్ల ప్రభు త్వం ఈ పరీక్షపై న్యాయ విచారణ చేపట్టి పరీక్షను మళ్లీ నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
కొత్తగా పరీక్షలు నిర్వహించాలి
జూనియర్ లైన్మెన్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీకు కావడమే కాకుండా విద్యుత్ సంస్థలో పని చేస్తున్న కొంత మంది ఉద్యోగులు రూ.10 లక్షలకు ఒక ఉద్యోగం అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నెల 17న నిర్వహించిన జూనియర్ లైన్మెన్ పరీక్షను పూర్తిగా రద్దు చేసి కొత్తగా పరీక్షలు నిర్వహించాలి. అప్పుడే అభ్యర్థులకు న్యా యం చేకూరుతుంది.
- ప్రభాకర్,
జూనియర్ లైన్మెన్ అభ్యర్థి
లీకేజీపై న్యాయ విచారణ చేపట్టాలి
జూనియర్ లైన్మెన్ ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రభుత్వం వెంటనే న్యాయ విచారణ చేపట్టాలి. వెయ్యి పోస్టులకు దాదాపు 12 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. లీకేజీతో వారి భవిష్యత్ అంధకారంగా మారింది. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఉమ్మడి జిల్లాకు చెందిన అనేక మంది నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది.
- ఆంజనేయులు,
సీఐటీయూ జిల్లా అధ్యక్షులు