Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు
నవతెలంగాణ - అచ్చంపేట
నల్లా బిల్లుల్లో అక్రమాలు చోటు చేసుకోకుం డా ఉండేందుకు పురపాలికలో ఆన్లైన్లో కుళాయి కనెక్ష న్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తెలిపారు. స్థానిక కార్యాలయంలో శుక్రవా రం ఆయన 'నవతెలం గాణ'తో మాట్లాడారు. ఆస్తి పన్ను బిల్లు చెల్లింపు తరహా మాదిరి గానే ఇకనుంచి నల్లా బిల్లు లు కూడా ఆన్లైన్లో చెల్లింపులు చేస్తామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో డిజిటల్ ఈ- ఇంటి నెంబర్లు ఏర్పా టు చేయాలని ఆదేశించి నట్లు చెప్పారు. అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో మొ త్తం నీటి కుళాయిల కనెక్ష న్లు 3954 ఉన్నాయని, కుళాయి లబ్ధిదారుల జాబి తా ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. కనెక్షన్ల ద్వారా 2021-2022 సంవత్సరానికి సంబం ధించి రూ. 35.79 లక్షలు వసూలు చేశామన్నారు. ప్రతి శనివారం మున్సిపాలిటీ అధ్వర్యంలో పశువుల సంత నిర్వహిస్తున్నా మని, నెలకు రూ.1.30లక్షల ఆదాయం వస్తుందన్నారు. పట్టణ పరిశుభ్రతకు ప్రజలు పూర్తిగా సహకరిం చాలని, అన్ని వార్డుల్లో ప్రతిరోజు ఉదయం పర్యవేక్షణ ముమ్మరం గా చేస్తామన్నారు. యజమానులు ఖాళీ స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేకుంటే జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు.